ratan-tata-telugu

NAVIC(నావిక్)-India's Own Navigation System in Telugu

NAVIC: భారతదేశపు సొంత నావిగేషన్ సిస్టం:

ఇంతకు ముందు రోజుల్లో మనం ఏదైనా తెలియని ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు తోటివారిని అడిగి వెళ్ళేవాళ్ళం. కానీ గూగుల్ మ్యాప్స్ వచ్చిన తరువాత మనకు తెలియని కొత్త ప్రదేశాలకు కూడా సులభంగా ఎవరి సహాయం అవసరం లేకుండానే వెళ్లగలుగుతున్నాం.

మనం ఎక్కడ ఉన్నాం? మనం వెళ్ళవలసిన ప్రదేశం ఏంటి? ఎలా వెళ్ళాలి ఇవన్నీ గూగుల్ మ్యాప్స్ "GPS అంటే Global Positioning System" ద్వారా చెప్పగలుగుతుంది.

1973 లో అమెరికా ఈ GPS ని కనుగొనడం జరిగింది. అలాగే అన్ని దేశాలకు ఈ GPS సేవలను అందిస్తుంది. అయితే 1999లో మనకు, పాకిస్తాన్ ని మధ్య జరిగిన కార్గిల్ యద్ధంలో పాక్ సైనిక దళాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవటానికి ఇండియన్ ఆర్మీ కి నావిగేషన్ వ్యవస్థ అవసరమైంది. అప్పటికే GPS ఉన్నటువంటి అమెరికాను భారత్ సహాయం కోరింది. కానీ, భారత్ కు సాయం చేయటానికి అమెరికా నిరాకరించింది. ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడకూడదు అనే ఉద్ద్యేశ్యంతో మన దేశం కూడా సొంత నావిగేషన్ సిస్టం ని డెవలప్ చెయ్యాలని అనుకుంది. దానికి 2006 లో భారత ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడంతో మన దేశానికి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్ద అయిన ఇస్రో (ISRO) సొంత నావిగేషన్ సిస్టం ని డెవలప్ చేసే బాధ్యతను తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ కి Qualcomm కంపెనీ కూడా తన సహాయం అందించడానికి ముందుకు వచ్చింది .

మొదట్లో ఈ ప్రాజెక్ట్ పేరు IRNSS అంటే Indian Regional Navigation Satellite System గా ఉండేది. కానీ ఇప్పుడు దీనిని NavIC (నావిక్) అంటే Navigation with Indian Constellation గా మార్చారు.

ఈ ప్రాజెక్ పూర్తయితే అమెరికా,రష్యా, చైనా, యూరోప్ తరువాత సొంత నావిగేషన్ సిస్టం ఉన్న అయిదవ వ దేశంగా మన భారతదేశం నిలుస్తుంది.

అయితే మన దేశం రూపొందిస్తున్న ఈ నావిక్ సిస్టం అనేది అమెరికాకు చెందిన GPS కన్నా మరింత మెరుగైనదిగా ఉండబోతుంది. ఎందుకంటే అమెరికా GPS అనేది ప్రపంచం మొత్తాన్ని కవర్ చెయ్యడానికి 24 సాటిలైట్స్ ని ఉపయోగిస్తే మన దేశం కేవలం ఇండియా ఒక్కదానికే 7 ఉపగ్రహాలను ఉపయోగిస్తుంది. దీని వలన మన దేశానికి చెందిన నావిక్ అనేది మరింత ఖచ్చితంగా ఉండబోతుంది.

అలాగే భవిష్యత్తులో మన దేశం మాత్రమే కాకుండాప్రపంచమంతటికి ఈ NavIC సేవలను అందించాలనే ఆలోచన లో భారతదేశం ఉంది.





You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+