ratan-tata-telugu

Interesting Facts About Indian Currency in Telugu

ఇండియన్ కరెన్సీ (Indian Currency) గురించి ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు:

1. ఒక పది రూపాయల నాణెం తయారు చేయడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 6 రూపాయల 10 పైసలు.

2. రూపాయి నోటు మరియు రూపాయి నాణేలను తప్ప మిగతా ఇండియన్ కరెన్సీ నోట్లు అన్నిటినీ (RBI)ఆర్‌బిఐ నే ముద్రిస్తుంది. రూపాయి నోట్లు మరియు రూపాయి నాణేలను మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ముద్రిస్తుంది.

3. ప్రస్తుతం చలామణీలో ఉన్న ఇండియన్ కరెన్సీ నోట్ల యొక్క సిరీస్ ని మహాత్మా గాంధీ సిరీస్ అని అంటాం.పేరుకి తగ్గట్టుగా అన్ని నోట్ల మీదా మహాత్మా గాంధీ బొమ్మ ఉండటమే ఈ సిరీస్ యొక్క ప్రత్యేకత. ఈ సిరీస్ 1996 నుండి చలామణీలో ఉంది.అయితే 1996 కి ముందు 'లయన్ కాపిటల్ సిరీస్' నోట్లని ఉపయోగించేవారు. ఈ నోట్ల మీద ప్రస్తతం రూపాయి నాణెం మీద ఉన్నట్టుగా మూడు సింహాలు కలిగిన సింబల్ ఉండేది.

4. మీకు తెలుసా! ఇండియన్ కరెన్సీ నోట్లని ప్రత్యేకమైన రంగులు, పత్తి మరియు బాల్సమ్ కలిగిన గుజ్జుతో తయారుచేస్తారు. ఇవి నోట్లను త్వరగా చిరగకుండా,అరిగిపోకుండా నిరోధించడానికి మరియు ఎక్కువ కాలం మన్నడానికి సహకరిస్తాయి.

5. మీరు ఏదైనా కరెన్సీ నోటుని కనుక స్పష్టంగా గమనించినట్టయితే నోటుకి ముందు భాగంలో దాని యొక్క విలువ(TEN RUPEES) ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో లిఖించబడి ఉంటుంది. నోటుకి వెనుకభాగంలో దాని విలువ 15 భాషలు అయిన అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణీ, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృత, తమిళం, తెలుగు మరియు ఉర్దూ.. ఇలా భారతదేశంలోని అన్ని భాషలవారికి అర్థమయ్యేలా 15 భాషలలో లిఖించబడి ఉంటుంది.

6. మీకు తెలుసా! మన ఇండియాలో జీరో నోట్లు కూడా చలామణీలో ఉన్నాయి. ప్రస్తుతం 2.5 మిల్లియన్ నోట్లు ముద్రించబడి అందుబాటులో ఉన్నాయి. అవినీతిపై పోరాడటానికి సహాయపడే విధంగా వీటిని ముద్రించాయి NGO సంస్థలు. ఉచితంగా ఉండాల్సిన సేవలకు బదులుగా లంచం కోరిన ప్రభుత్వ కార్యకర్తలకు కోపంతో ఉన్న ప్రజలు వీటిని వారికి ఇచ్చి వారి బాధ్యతను గుర్తుచేసే ఉద్దేశంతో NGO's వీటిని ప్రవేశపెట్టాయి.




7. 1954 - 1978 కాలంలో 5,000 మరియు 10,000 నోట్లు కూడా అందుబాటులో ఉండేవి.

8. రూపాయి నాణేలను మన భారత దేశంలోని ప్రధాన నగరాలు అయిన ఢిల్లీ, ముంబాయ్, హైదరాబాద్, కలకత్తా లలో ముద్రిస్తారు. అయితే ఏ నాణెం ఎక్కడ ముద్రించబడిందో గుర్తించడానికి వీలుగా ఒక్కొక్క నగరాన్ని ఒక్కొక్క సింబల్ సూచించేలా నాణెంపై ముద్రించబడ్డ సంవత్సరం క్రింది భాగంలో గుర్తులను ముద్రించింది ప్రభుత్వం. ఉదాహరణకి వృత్తాకారం సింబల్ ఉంటే అది నోయిడాలో, డైమండ్ సింబల్ ఉంటే అది ముంబాయిలో, స్టార్ సింబల్ ఉంటే అది హైదరాబాద్ లో, అసలు ఏ సింబల్ లేకపోతే అది కలకత్తాలోనీ ముద్రించబడ్డాయని అర్ధం.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+