ratan-tata-telugu

Donations given by Top Indian Companies-Telugu 

Donations given by Top Indian Companies-Telugu

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా భయపెడుతున్నదో చెప్పక్కర్లేదు.కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి, చిన్న వ్యాపారులు, కార్మికులు, ఇల్లు లేనివారు, స్వయం ఉపాధి పొందుతున్న వారిపై కరోనా వైరస్ వల్ల ఎఫెక్ట్ పడితే.. వారిని ఆదుకునేందుకు మన దేశ పారిశ్రామిక దిగ్గజాలు ఒక్కొక్కరుగా తమ సహాయాన్ని అందివ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు తమవంతు సహాయాన్ని అందించిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

విప్రో 1125 కోట్లు :

విప్రో సాఫ్ట్ వేర్ సంస్థ అధినేత అయినటువంటి అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ రూ. 1125 కోట్ల రూపాయల విరాళం అందించింది. ఈ రూ.1125 కోట్లలో.. విప్రో లిమిటెడ్ రూ.100 కోట్లు ఇవ్వనుండగా.. విప్రో ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రూ.25 కోట్లు విరాళంగా అందించనుంది. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ.1000 కోట్లు సాయం చేయనుంది. విప్రో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఏటా కేటాయించే మొత్తానికి, అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ చేసే దాతృత్వానికి ఇవి అదనం.

అంబానీ 500 కోట్లు:

పీఎం-కేర్స్ సహాయనిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తరపున పీఎం కేర్స్- సహాయ నిధికి రూ.500 కోట్లు విరాళంగా అందించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా.. కరోనాను అరికట్టేందుకు కృషి చేస్తున్న గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.5 కోట్ల సాయాన్ని ముఖేష్ అంబానీ ప్రకటించారు.

టాటా & సన్స్ 1500 కోట్లు:

టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా రూ.500 కోట్ల విరాళం అందించగా.. టాటా సన్స్ రూ.1000కోట్లు విరాళంగా ప్రకటించడంపై దేశమంతటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టాటా సన్స్ వెంటిలేటర్లు కోసం ఇంకా కరోనా నివారణ కోసం అవసరం అయినవాటి కోసం ఈ డబ్బును వినియోగిస్తామని తెలిపారు. అంతేకాకుండా కష్టంలో ఉన్న నా దేశాన్ని ఆదుకోవడానికి యావదాస్తిని ఇవ్వడానికి సిద్ధం అన్న వ్యాఖ్యతో మనసున్న మహారాజు అని భారతదేశ ప్రజల మనసులలో తనదైన ముద్ర వేసుకున్నారు టాటా.

సన్‌ఫార్మా రూ.25 కోట్లు:

కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించేందుకు సన్‌ ఫార్మా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ముందుకు వచ్చింది. కరోనా వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు రూ.25 కోట్ల విలువైన హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌ తదితర మందులు, శానిటైజర్లను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.

బజాజ్ గ్రూప్ 100 కోట్లు:

పుణెలో కోవిడ్-19 కు అడ్డుకట్టవేయడానికి కావలసిన కీలక ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి రూ. 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసినట్లు బజాజ్ గ్రూప్ తెలిపింది. అదే సమయంలో కార్మికులు, ఇల్లు లేనివారు, వీధి పిల్లలకు తక్షణం సహాయం చేస్తున్నట్లు బజాజ్ గ్రూప్ అధిపతి రాహుల్ బజాజ్ ప్రకటించారు.

జీఎస్‌ఐ: ఒకరోజు వేతనం ఇవ్వండి

కరోనాపై పోరులో సర్కారుకు బాసటగా నిలిచేందుకు ప్రధానమంత్రి సహాయ నిధికి ఒక రోజు వేతనం విరాళంగా ఇవ్వాలని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) తన ఉద్యోగులను కోరింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆరు జోన్ల అధిపతులకు వినతులు పంపినట్లు జీఎస్‌ఐ డీజీ శ్రీధర్‌ తెలిపారు.

ఫ్రెండ్స్, పేదవారికి పది రూపాయలు ఇవ్వడానికి పదిసార్లు ఆలోచించే ప్రజలు ఉన్న ఈరోజుల్లో ఇన్ని కోట్ల రూపాయలని తృణప్రాయంగా విరాళంగా ఇవ్వడమనేది సాధారణమయిన విషయం కాదు. కరోనా వ్యాధిని అరికట్టేందుకు, దేశ ప్రజలని ఆదుకునేందుకు తమ వంతు సహాయం చేసే ప్రతి ఒక్కరికి మనం రుణపడి ఉన్నాం.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+