ratan-tata-telugu

CAA Bill గురుంచి తెలుసుకోండి What is CAA Bill

ప్రస్తుత దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అంశాలలో పౌరసత్వ సవరణ బిల్లు(Citizenship amendment Bill) ఒకటి. అసలు పౌరసత్వ సవరణ బిల్లు అంటే ఏమిటి? పౌరసత్వ బిల్లు ఏమి చెబుతోంది? పౌరసత్వ బిల్లు సవరణ యొక్క ఆవశ్యకత ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారత దేశం - పాకిస్థాన్ విడిపోయాక 1955 లో పౌరసత్వ చట్టం చేసారు. దేశంలోని పౌరులందరికీ పౌరసత్వం కల్పింస్తుంది ఈ చట్టం.

ఈ పౌరసత్వ సవరణ బిల్లు యొక్క ముఖ్య ఉదేశ్యం సరిహద్దు దేశాలనుంచి వచ్చిన మైనారిటీ శరణార్ధులకు మన దేశంలో పౌరసత్వం కల్పించడం. తమ దేశాలలో రక్షణ లేదని, ఆశ్రయం కల్పించాలంటూ వచ్చిన పాకిస్థాన్, బంగ్లాదేశ్,ఆఫ్గనిస్తాన్ దేశాల నుంచి మైనారిటీలు పెద్ద సంఖ్యలో మన దేశానికి వలస వచ్చారు.వారిలో ముస్లిమేతర శరణార్థులు అనగా హిందూ, సిక్కు, బౌద్దులు, జైనులు, పార్సవీలు, క్రైస్తవులను ఉద్దెశించి పౌరసత్వం కల్పించేందుకు సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం.ఇప్పటివరకు ఈ చట్టంలో నాలుగుసార్లు సవరణలు చేశారు. అయితే ఎప్పుడూ ఇంతటి వివాదం చోటు చేసుకోలేదు. అయితే ఈ సారి సవరణలో ముస్లింల ప్రస్తావన లేకపోవడంతో అది వివాదానికి దారి తీసింది. ఇది ఇలా ఉండగా ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన.

పౌరసత్వ బిల్లు సవరణ యొక్క ఆవశ్యకత, షరతులు, కారణాలు:

శరణార్థులుగా సరిహద్దు దేశాలనుంచి వచ్చిన వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా అడ్డుగోడగా ఉన్న 64 సంవత్సరాల క్రితంనాటి భారత పౌరసత్వ చట్టానికి సవరణలు అవసరమని ప్రభుత్వం భావించింది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా భారత దేశంలోకి ప్రవేశించి కాలపరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను 'అక్రమ వలసదారులు' అని అప్పటి చట్టం నిర్వచిస్తోంది. అప్పటి చట్టం ప్రకారం అక్రమ వలసదారులను తిరిగి వారి దేశం పంపించాలి లేదా జైళ్లలో నిర్బందించాలి. అయితే తాజా సవరణ వళ్ళ అలాంటి వలసదారులు అందరికి మన దేశ పౌరులుగా నివసించడానికి పౌరసత్వం లభిస్తుంది. అయితే ముందుగా ఈ వలసదారులు తాము పలానా దేశానికి చెందిన వారమని నిరూపించుకోవాలి మరియు 6 సంవత్సరములు కనీసం భారత దేశంలో నివిసించి ఉండాలి అన్న షరతులను ఈ కొత్తసవరణలో అర్హతలుగా పొందుపరిచింది కేంద్ర ప్రభుత్వం.

అయితే ఈ వలసలు అనేది గడిచిన కొద్ది సంవత్సరాలలో వేల నుంచి లక్షల సంఖ్యకు చేరుకోవడం, దీని కారణంగా భారత దేశంలోని ప్రజాస్వామిక ప్రక్రియ అయినటువంటి ఎన్నికలలో నిర్ణయాత్మక పాత్ర పోషించేంత పరిస్థితి రావడంతో ,మోదీ ప్రభుత్వం అక్రమ వలసలను తీవ్రంగా పరిగణించింది. ఎలాంటి దమనకాండ, అణిచివేత లేనపుడు ఇస్లామిక్ దేశాలలోని పౌరులు భారత దేశంలో అక్రమంగా ప్రవేశించినపుడు వాళ్ళను తిరిగి వాళ్ళ దేశం పంపడం అవసరమని ప్రభుత్వం ఉద్దేశ్యం. ఈ పై కారణాల మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ బిల్లులో సవరణలు చేసింది.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+