ratan-tata-telugu

తెలుగు సామెతలు - Best Telugu samethalu - Best Telugu Proverbs

తెలుగు సామెతలు (Best Telugu Proverbs):

సామెతలు లేదా లోకోక్తులు అని పల్లెలోని ప్రజలు ఎక్కవుగా వాడుతూ ఉంటారు. "సామెతలు" ప్రజల అనుభవాల నుండి పుట్టుకొస్తాయి. వీటికి రచయితలు అంటూ ఎవరు ఉండరు. వీటిని అప్పుడు జరుగుతున్న ఒక సంఘటనని, సన్నివేశాన్ని పోల్చుతూ సరదాగా, హాస్యభరితంగా చెప్పడానికి ఈ సామెతలను వాడతారు. అలాంటి కొన్ని సామెతలను ఇప్పుడు తెలుసుకుందాం.

- కుక్క వస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు

- అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటుందన్నాడట!

- అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవళికి వెళ్ళి నోట్లో వేసుకున్నాడట!

- మొహమాటానికి పోయి ముండ కడుపు తెచ్చుకుందట

- సిగ్గు లేని వాడికి నవ్వే సింగారం

- ఆవలింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు!

- అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట

- మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుండా ఉంటుందా?

- అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందట!

- నిద్రపోయే వాడిని నిద్ర లేపొచ్చు కానీ; నిద్ర పోయినట్టు నటించేవాడిని నిద్ర లేపలేం

- పొమ్మనలేక పొగ పెట్టినట్లు

- పోన్లే పాపమని పాత బట్ట ఇస్తే; గుడి వెనక పోయి ఉరి వేసుకుందట

- పేనుకు పెత్తనం ఇస్తే తల అంత గొరికి పెట్టిందంట.

- తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగిన అది కళ్ళే అనుకుంటారు

- అందని ద్రాక్షలు పుల్లన

- అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు

- ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం

- కుక్క కాటుకి చెప్పు దెబ్బ

- ఆలస్యం అమృతం విషం

- పరిగెత్తి పాలు తాగడం కంటే నిల్చుని నీళ్ళు తాగటం మేలు

- చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు

- తంతే గారెల బుట్టలో పడ్డాడుట!

- కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట!

- ఆస్తి మూరెడు ఆశ బారెడు!

- పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం

- మింగటానికి మెతుకు లేదు కాని మీసానికి సంపెంగ నూనె

- పొరుగింటి పుల్ల కూర రుచి

- అందితే జుట్టు అందక పోతే కాలు

- ఇల్లలకగానే పండగ కాదు

- ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరగక చెడతాడు

- ఊళ్ళో పెళ్ళి కి కుక్కల హడావిడి



- అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

- ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

- ఇల్లు పీకి పందిరేసినట్టు

- చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

- కందకు లేని దురద కత్తిపీటకెందుకు

- నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు

- పిట్ట కొంచెం కూత ఘనం

- ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ

- ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

- ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

- కుసే గాడిద వచ్చి మెసే గాడిదను చెడగొట్టిందంట

- సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు

- ఇళ్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పు అడిగాడట

- నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

- మెరిసేదంతా బంగారం కాదు

- ఉన్న లోభి కంటే లేని దాత నయం

- కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

- కలలోని కౌగిలికి కడుపు లొస్తాయా?

- కాలితో నడిస్తే కాశీకి పోవచ్చునుగాని, తలతో నడిస్తే తనవాకిలి దాటవచ్చునా

- కింద పడినా, మీసాలకు మన్ను కాలేదన్నట్లు

- కుట్టే వాడికి కుడివైపు, చీదే వాడికి ఎడమవైపు ఉండకూడదు

- కూతురు కనలేకపోతే, అల్లుడి మీద పడి ఏడ్చినట్లు.

- కొండ నాలికను మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయినట్టు

- కోళ్లను తింటారా అంటే బొచ్చు పారేస్తాము అన్నట్లు

- గంధం సమర్పయామి అంటే గొడ్డలి నూరరా అన్నాడట

- గాలికిపోయిన పేలపిండి భగవదర్పితమన్నట్లు

- చస్తానని చద్దన్నం తింటే చల్లగా నిద్రవచ్చిందంట

- చాదస్తపు మొగుడు చెపితే వినడు, చెప్పకుంటే కరుస్తాడు

- చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద

- చుట్టురా శ్రీ వైష్ణవులే చూస్తే కల్లు కుండ లేదు

- చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లు

- గాజుల చెయ్యి గలగలలాడితే ఇల్లు కళకళలాడుతుంది.

- గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛపోయిందట



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+