ratan-tata-telugu

Why Do Most Mobile Phones have Non-Removable battery

స్మార్ట్ ఫోన్ లో Non-Removable బ్యాటరీస్ ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?

Smartphonesటెక్నాలజీ ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలిసిందే. ఈ టెక్నలాజి యుగం లో మానవుడికి Smartphone అనేది లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది . ఎంతలా అంటే మనం ఉదయంలేచిన వెంటనే మొబైల్ ఎక్కడుందా అని వెతుక్కునే దగ్గర నుంచి నైట్ మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకుని పడుకొనే దాకా దీని ప్రభావం కాలక్రమేణా పెరిగిపోతూ వచ్చింది. మనలో చాల మంది మొబైల్ ఫోన్స్ వచ్చిన కొత్తలో Removable బ్యాటరీస్ చూసి ఉంటాం. కొన్ని సార్లు ఫోన్ ఉన్నట్టుండి హ్యాంగ్ అయిపోతే బ్యాటరీ తీసి, మళ్ళీ పెట్టి ఫోన్ Switch On చేసే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు మనం కొంటున్న స్మార్ట్ ఫోన్స్ కి removable బ్యాటరీస్ ఎందుకు రావడం లేదో ఇప్పుడు చూద్దాం.

2007 వ సంవత్సరంలో ఆపిల్ తన మొదటి ఐఫోన్ ను లాంచ్ చేసిన దగ్గర నుంచి Closed బ్యాటరీస్ తోనే Manufacturing చేసింది . అప్పటికి మిగతా కంపెనీలు Removable బ్యాటరీస్ తో Manufacturing చేయడం మరియు జనాలు దానికి బాగా అలవాటుపడడంతో ఐఫోన్ పైన కొంత మందిలో విముఖత వచ్చింది.అయినప్పటికి ఇప్పుడు మిగతా కంపెనీలు కూడా Smartphones ని closed బ్యాటరీస్ తోనే తయారుచేయడానికి కారణాలు దాని వలన కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటంటే

1. Premium Design:

Smartphones లో చాలా కీలకపాత్ర పోషించేది వాటి డిజైన్ . Removable బ్యాటరీస్ లో Flexibility ఉన్నప్పటికీ వాటి డిజైన్ మీద చాల ప్రభావం చూపిస్తాయి . ఫోన్ కి మంచి లుక్ రావడం కోసం, ఫోన్ ని మరింత స్లిమ్ గా తయారుచెయ్యడం కోసం అలాగే మొబైల్ కవర్ ని గ్లాస్ /మెటల్ తో తయారు చేయడానికి ఈ Closed బ్యాటరీస్ అయితే సులభంగా ఉంటుంది.

2. Water & Dust Resistance:

మన ఫోన్ పొరపాటున అనుకోకుండా నీటిలో పడిపోవడం, లేదా వర్షంలో తడవడం వంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఫోన్ వెనకాల కవర్ ఓపెన్ చేసుకునేలా ఉంటె దానిలోకి నీరు, దుమ్ము వంటివి చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఫోన్ Zero Openings మరియు బలమైన Internal Sealing కలిగి ఉంటె నీరు లోపలికి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే ఫోన్‌లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవకుండా ఉంటాయి.

3. Adding Other Features:

Removable బ్యాటరీస్ వల్ల Smartphone ని Environmental Factors నుంచి రక్షించడానికి ఫోన్ లోపల Extra Padding ఇవ్వవలసి వస్తుంది . అదే Closed బ్యాటరీస్ ఉండే ఫోన్ లలో అయితే ఈ extra padding ఇవ్వనవసరం లేదు. ఆ ప్రదేశంలో ఫోన్‌ కి మరిన్ని ఫీచర్స్ ఇవ్వడం కోసం అంటే Dual cameras , స్టీరియో స్పీకర్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ లేదా ఫోన్ స్టెబిలిటీ పెంచడం కోసం మెరుగైన రబ్బర్ గాస్కెట్స్ మొదలైనవి అమర్చవచ్చు.

ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే ఈ రోజుల్లో వస్తున్న అన్ని స్మార్ట్ ఫోన్ లలోను Non-Removable బ్యాటరీస్ ని ఉపయోగిస్తున్నారు.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+