ratan-tata-telugu

Top 5 Chrome Extensions that are Useful for you in Telugu

అందరికి ఉపయోగపడే టాప్ 5 Chrome Extensions:

గూగుల్ క్రోమ్, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఉపయోగించే బ్రౌజర్. ఇది మీరు ఎక్కడైనా వర్క్ చేసుకునేలా syncing capabilities మరియు ఎన్నో ఉపయోగపడే extensions కలిగి ఉంది. ఈరోజు మీకు ఉపయోగపడే కొన్ని Chrome Extensions గురించి తెలుసుకుందాం.

Wayback Machine:

ఈ ఎక్స్టెన్షన్, ఏదైనా వెబ్ సైట్ నీ అది ఒకప్పుడు ఎలా ఉండేదో చూపిస్తుంది. ఒక వెబ్ సైట్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది తర్వాత అది ఎలా మారుతూ వచ్చింది అనేది ఈ ఎక్స్టెన్షన్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి యూట్యూబ్ ఎలా ఉందో తర్వాత ఎలాంటి మార్పులు చేసుకుందో అని దీనిని ఉపయోగించి మనం చూడవచ్చు. ఇలా చాలావరకు వెబ్సైట్లను చూడవచ్చు అలాగే దీనిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాటిని కూడా ట్రై చేయొచ్చు.

Awesome screenshot: Screen Video Recorder

మీరు క్రోమ్ బ్రౌజర్ కోసం మంచి ఫీచర్స్ కలిగి ఉన్న స్క్రీన్ షాట్ టోల్ కోసం వెతుకుతున్నట్లు అయితే ఈ Awesome screenshot అనేది ఒక మంచి ఎక్స్టెన్షన్. మీరు ఏదైనా ఒక వెబ్ పేజీ యొక్క స్క్రీన్ షాట్ ను తీయాలనుకుంటే మీరు Awesome screenshot లో వివిధ ఆప్షన్లను సెలెక్ట్ చేసుకొని తగిన విధంగా స్క్రీన్షాట్ తీసుకోవచ్చు. అలాగే దీనిలో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది.

TinEye Reverse Image Search

మీరు ఏదైనా ఒక ఇమేజ్ ను ఉపయోగించి అది ఒరిజినల్ గా ఎక్కడ అప్లోడ్ చేశారు తెలుసుకోవాలన్నా లేదా ఆ ఇమేజ్ హై రిజల్యూషన్ లో కావాలన్నా మీకు TinEye ఎక్స్టెన్షన్ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎక్స్టెన్షన్ ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత క్రోమ్ లో ఏదైనా ఒక ఇమేజ్ పై రైట్ క్లిక్ చేసి TinEye ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అయి ఆ ఇమేజ్ గురించి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అలాగే ఆ ట్యాబ్లో గల డ్రాప్ డౌన్ మెనూను ఉపయోగించి ఆ ఇమేజ్ ను మీకు కావలసిన విధంగా సెర్చ్ చేసుకోవచ్చు.

Grammerly:

మనం టైప్ చేస్తున్నప్పుడు స్పెల్లింగ్స్ ను మరియు గ్రామర్ ను కరెక్ట్ చేయడానికి ఈ Grammerly అనేది ఒక గొప్ప ఎక్స్టెన్షన్. దీనిని జిమెయిల్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలా మీరు టైప్ చేసే ఏ వెబ్సైట్ లో అయినా ఉపయోగించవచ్చు. ఇది మనం టైప్ చేసిన దానిలో ఎటువంటి తప్పులు ఉన్న సరిచేస్తుంది. అలాగే దీనిలో గల వివిధ ఆప్షన్ల మీరు ఉపయోగించుకోవచ్చు.

Dark Reader:

మీరు Dark Theme ను ఇష్టపడే వాళ్ళు అయితే మీరు ప్రతి వెబ్ పేజ్ ను Dark Theme లో చూడాలనుకుంటే ఈ Dark Reader ఎక్స్టెన్షన్ మీకు ఉపయోగపడుతుంది. ఇది ప్రతి వెబ్ సైట్ ను Theme లోకి మార్చేస్తుంది. ఇది బ్రైట్ కలర్స్ యొక్క బ్రైట్నెస్ కూడా తగ్గించేస్తుంది. అలాగే మీరు ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే అక్కడ మీరు చాలా కంట్రోల్స్ ని చూడవచ్చు.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+