ratan-tata-telugu

Top 5 Interesting Websites in Telugu

ఇంటర్నెట్ లో కొన్ని కోట్ల వెబ్ సైట్స్ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని వెబ్ సైట్ లు మనల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని వెబ్ సైట్స్(Interesting Websites)గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


THE FACESOFFACEBOOK.COM

ప్రతి రోజు కొన్ని కోట్లమంది Facebook లో ప్రొఫైల్ ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటారు. అలా అప్లోడ్ చేసే ప్రొఫైల్ ఫొటోస్ "THE FACESOFFACEBOOK.COM" అనే వెబ్సైట్లో మనం చూడవచ్చు . గూగుల్ క్రోమ్ లో FACESOFFACEBOOK.COM అని టైప్ చేస్తే పైన చూపించిన విధంగా మీకు ఒక ఇమేజ్ ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన ఇమేజ్ మీద మీరు ఎక్కడ క్లిక్ చేసిన ఆ ఇమేజ్ పెద్దదిగా అయ్యి ఫేస్బుక్ ప్రొఫైల్ ఫొటోస్ చూపిస్తుంది. అంతేకాకుండా ఆ ఓపెన్ అయిన ప్రొఫైల్ ఫోటో మీద మీరు క్లిక్ చేస్తే వాళ్ల ప్రొఫైల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. కానీ కొన్ని కోట్ల ప్రొఫైల్ ఫొటోస్ దీనిలో ఉండడం వల్ల మీ ప్రొఫైల్ ఫోటోని తెలుసుకోవడం చాలా కష్టం కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

FLIGHTRADAR24

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు దాదాపుగా లక్షకు పైగా విమానాలు ప్రయాణిస్తుంటాయి. అలా ప్రయాణించే ప్రతి విమానం ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందో ఈ FLIGHTRADAR24 అనే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. FLIGHTRADAR24 అని గూగుల్ క్రోమ్ లో సెర్చ్ చేస్తే మన ప్రపంచ పటం తెరుచుకొని దానిమీద మీద చాలా విమానాలు కనపడతాయి. అలా కనిపించే ఏ విమానాన్ని అయినా సరే మీరు క్లిక్ చేస్తే ఆ యొక్క విమానం ఎక్కడ ఉందో అలాగే ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందో మరియు విమానం యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మీరు కూడా ఏదైనా విమానం గురించి తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్ లోకి వెళ్లి చూడండి.

ASKEW

గూగుల్ క్రోమ్ లో "ASKEW" అని టైప్ చేస్తే మీకు ఓపెన్ అయ్యే పేజ్ కుడివైపుకు వంగి (Bend) ఉంటుంది. నిజానికి ASKEW మీనింగ్ 'Not in straight line or level position' {వంగిన} అని ఉంటుంది. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.

STARS.CHROME EXPERIMENTS.COM

మీకు అంతరిక్షం, సౌర కుటుంబం, ఆస్ట్రానమీ మీద ఆసక్తి కలిగి ఉంటే మీ జీవితంలో ఒక్కసారి అయిన STARS.CHROME EXPERIMENTS వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. కొన్ని లైట్ ఇయర్స్ దూరం నుంచి కన్నుల విందు గా అనిపించే కొన్ని కోట్ల నక్షత్రాలు, గ్రహాలు మరియు చివరిగా సూర్యుడిని ఈ వెబ్సైట్లో చూడొచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఎడమ వైపున ఉన్న ప్లే గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోకండి.

GOOGLE SPHERE

గూగుల్ హోమ్ పేజ్ మనం చూస్తే దీర్ఘచతురస్రం ఆకారంలో ఉంటుంది. కానీ మీరు గూగుల్ క్రోమ్ లో "GOOGLE SPHERE" అని సెర్చ్ చేస్తే గుండ్రంగా ఉండే గూగుల్ హోం పేజ్ ని మీరు చూడొవచ్చు. మీరు కూడా గుండ్రంగా ఉండే గూగుల్ హోమ్ పేజ్ ని చూడాలనుకుంటే మీరు ఒకసారి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి GOOGLE SPHERE అని సెర్చ్ చెయ్యండి.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+