ratan-tata-telugu

IPO in Telugu-What is IPO in Stock Market-Telugu Badi

What is IPO(Initial Public Offering):

IPO ... Initial Public Offering. అంటే ఏదైనా ఒక కంపెనీ మొట్టమొదటిసారి తమ షేర్లను ప్రజలకు అమ్మడాన్ని IPO అంటారు. సాధారణంగా ఏదైనా కంపెనీ మరింత విస్తరించాలనుకున్న .లేక తనకు ఉన్న అప్పులను తీర్చాలన్నా . లేదా మరొక చోట ఒక కొత్త ప్లాంట్ ని నిర్మించాలన్నా కొంత మూలధనం అవసరం అవుతుంది. ఆ డబ్బుని ప్రజల దగ్గరనుండి సేకరించడం కోసం ఆ కంపెనీ తమ కంపెనీ షేర్లను ప్రజలకు అమ్ముతుంది.

అయితే అంతకన్నా ముందు షేర్లను అమ్మడానికి కంపెనీ (SEBI)సెబీకి దరఖాస్తు చేసుకోవాలి. సెబీ నుండి అనుమతి లభించిన తరువాత కంపెనీ IPO కి వస్తుంది. అలాగే కంపెనీ తన షేర్లను ఇన్వెస్టర్స్ కి ఏ ధరకి అమ్మాలనుకుంటుంది , అసలు IPO ద్వారా ఎంత సొమ్ము సేకరించబోతుంది, ఎన్ని షేర్లను అమ్మాలనుకుంటుంది, ఏ సమయంలో IPO కి రాబోతుంది వంటి వివరాలన్నీ విడుదల చేస్తుంది. ఈ IPO లో మీ సాధారణంగా షేర్లను కొన్నట్టు కాకుండా మీరు షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది . అయినా సరే మీకు ఆ షేర్లు దక్కుతాయని హామీ లేదు . ఎందుకంటే కంపెనీ అమ్మాలనుకున్న షేర్ల సంఖ్యకంటే ఎక్కువమంది షేర్ల కోసం దరఖాస్తు చేసుకుంటే , వారిలో కొంతమందికి మాత్రమే ఆ షేర్లు దక్కుతాయి. ఒకవేళ మీకు షేర్లు కనుక లభించకపోతే మీ డబ్బుతిరిగి వాపసు అందుతుంది.

 

 

IPO వాడే కొన్ని పదాలు , వాటికి అర్దాలు తెలుసుకుందాం :

Over subscription: అంటే కంపెనీ IPO ద్వారా అమ్మడానికి 10,00,000 లక్షల షేర్లను జారీ చేసింది అనుకుందాం. కానీ 20,00,000 లక్షల షేర్ల కోసం దరఖాస్తులు చేసుకుంటే దానిని over subscription అంటారు.

Under Subscription: అంటే కంపెనీ 10,00,000 అమ్మాలనుకుంది . కానీ 10,00,000 లక్షల కన్నా తక్కువ మంది ఆ షేర్ల కోసం దరఖాస్తు చేసుకుంటే, దానిని Under Subscription అంటారు.

Price Band and Cut off price: అంటే కంపెనీ ఏ ధర పరిధిలో షేర్లను అమ్మాలనుకుంటుందో తెలిపే దాన్ని Price Band అంటారు. ఉదాహరణకి ఒక కంపెనీ Price Band ని Rs.270 - 300 గా నిర్ణయించింది అనుకుందాం. అంటే మనం 270 నుండి 300 మధ్యలో ఏ ధరలో అయినా మనం షేర్లను కొనడానికి దరఖాస్తు చేసుకోవచ్చు .

సాధారణంగా IPO లో షేర్లను కొనడానికి దరఖాస్తు చేసుకోవడం నుండి, కంపెనీ స్టాక్ ఎక్స్చేంజి లో నమోదు అయ్యేవరకు జరిగే ప్రక్రియ అంతా కూడా ప్రైమరీ మార్కెట్ లో జరుగుతుంది . ఒక్కసారి షేర్లు కనుక స్టాక్ ఎక్స్చేంజి లో నమోదు అయిన తరువాత కంపెనీ సెకండరీ మార్కెట్ లోకి వెళ్తుంది. అంటే మనం రోజువారీ ఏవైతే షేర్లు కొని అమ్ముతున్నామో దానిని సెకండరీ మార్కెట్ అంటారు.

  

ఇంకా బాగా అర్ధం అవ్వడం కోసం ఒక కంపెనీని ఉదాహరణగా తీసుకుందాం.

ఇవి CDSL అనే కంపెనీ IPO వివరాలు;

Issue Open: Jun 19, 2017 - Jun 21, 2017

Issue Size: 35,167,208 Equity Shares

price band: Rs 145 - Rs 149 Per Equity Share

Minimum Order Quantity: 100 Shares

  

ఇప్పుడు దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం:

Issue Open: Jun 19, 2017 - Jun 21, 2017: అంటే కంపెనీ IPO కి సంబందించిన ఇష్యూ జూన్ 19 నుండి జూన్ 21 తేదీలలో ఓపెన్ లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా CDSL షేర్లు కొనాలనుకుంటే ఆ తేదీలలో షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

Issue Size: 35,167,208 Equity Shares: ఆ కంపెనీకి సంబందించిన 35,167,208 షేర్లను ప్రజలకు అమ్మాలనుకుంటుంది.

price band: Rs 145 - Rs 149 Per Equity Share: మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే ఒకేవేళ మనం షేర్లు కొనాలంటే 145 రూ నుండి 149 రూ మధ్యలో .. ఏ ధర వద్ద షేర్లను కొనాలనుకుంటున్నారో ఎంచుకోవాలి . ఇక్కడ మీకు ఒక సలహా .. ఒక వేళ మీకు IPO లో షేర్లు దక్కాలంటే price band లో అధిక ధరను ఎంపిక చేసుకోండి. అలా చేస్తే మీకు షేర్లు దక్కే అవకాశం ఉంటుంది.

Minimum Order Quantity: 100 Shares: అంటే మీరు ఈ IPO లో పాల్గొనాలి అంటే మీరు కనీసం 100 షేర్లను కొనవలసి ఉంటుంది.

అయితే జూన్ 30 వ తేదీన CDSL షేర్లు స్టాక్ ఎక్స్చేంజి లో నమోదు అయ్యాయి. అయితే కంపెనీ జారీ చేసిన షేర్ల సంఖ్యకంటే 170 రెట్లు ఎక్కువ స్పందన లభించడం వల్ల అంటే over subscription జరగడం వల్ల షేర్లు ఎక్స్చేంజి లో నమోదు అయిన వెంటనే షేరు ధర 80% వరకు పెరిగింది. అంటే 149 రూ గా ఉండవలసిన షేరు ధర 250 అయ్యింది. ఆ IPO లో షేర్లు లభించిన వారికి ఒక్క రోజులోనే 80% లాభం వచ్చిందన్నమాట.

అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపెనీ షేర్లకు అనుకున్నంతగా స్పందన లభించకపోతే షేరు ధర తక్కువగా నమోదు అవుతుంది. అటువంటి సమయంలో ఇన్వెస్టర్లు నష్టపోయే ప్రమాదం ఉంది.

  
IPO లో నష్టపోకుండా ఉండాలంటే కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించాలి అవేంటో చూద్దాం.

1) IPO కి వస్తున్నా కంపెనీ చరిత్ర ఏమిటి ? ఎంతకాలం నుండి ఆ కంపెనీ ఉంది ?

2) అసలు ఆ కంపెనీ వేటిని తయారు చేస్తుంది ? లేదా ఎటువంటి సేవలు అందిస్తుంది ?

3) ఆ కంపెనీని నడుపుతున్నది ఎవరు? అంటే ఆ కంపెనీని మేనేజ్మెంట్ ఎలా ఉంది?

4) ఆ కంపెనీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అలాగే ఎంత అప్పు ఉంది?

5) ఆ కంపెనీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?

6) ఆ కంపెనీ మీద ఇంతకు ముందు ఏవైనా అవినీతి ఆరోపణలు లేదా ఆ కంపెనీ కి ఏవైనా సమస్యలు ఉన్నాయా?

ఇలా అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుని ఆ తరువాత మాత్రమే IPO లో షేర్లను కొనాలి .



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

  
ads
+