ratan-tata-telugu

Bitcoin అంటే ఏమిటి? - Bitcoin in Telugu

What is Bitcoin in Telugu:

(Bitcoin) బిట్ కాయిన్: ఈ ప్రపంచంలో అతి తక్కువ కాలంలో అత్యధిక రాబడి ఇచ్చింది ఏదైనా ఉంది అంటే అది Bitcoin. అసలు ఈ Bitcoin అంటే ఏమిటి? ఎవరు దీనిని క్రియేట్ చేసారు. అది ఎంత లాభాలను ఇచ్చింది. ఒకవేళ మనం Bitcoin కొనాలనుకుంటే ఎలా కొనాలి? దీనిలో ఉండే రిస్క్ ఏమిటి? ఇలా Bitcoin కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2010 లో ఎవరైనా 4500 రూపాయలు Bitcoin లో పెట్టుబడి పెట్టి ఉంటె 2017 లో దాని విలువ 482 కోట్లు అయ్యింది. ప్రపంచంలో ఏది కూడా ఈ స్థాయిలో రాబడిని ఇవ్వలేదు. Bitcoin అనేది ఒక క్రిప్టో కరెన్సీ (Cryptocurrency). 2009 లో Satoshi Nakamoto అనే ఒక ప్రోగ్రామర్ దీనిని క్రియేట్ చేసాడు. అయితే ఈ Satoshi Nakamoto ఎవరు అనేది ఎవరికీ తెలియదు.

ఈ Bitcoin విలువ ఇంతలా పెరగడానికి కారణం దీనిని క్రియేట్ చేసినపుడు కేవలం 21 మిలియన్ బిట్ కాయిన్ లు మాత్రమే ఉండేలా దీనిని ప్రోగ్రాం చేసారు. కాబట్టి మరలా కొత్త Bitcoin లను క్రియేట్ చెయ్యలేరు. కానీ దీనిని కొనేవాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరిగిపోవడంతో డిమాండ్ బాగా పెరిగిపోయి దీని విలువ వేగంగా పెరుగుతుంది. ఇదంతా కూడా కంప్యూటర్ అల్గోరిథం మీద ఆధారపడి పని చేస్తుంది. ప్రతిదేశంలో కరెన్సీ ని ఆ దేశ సెంట్రల్ బ్యాంకు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ Bitcoin ని ఏ దేశపు గవర్నమెంట్ గాని, ఏ బ్యాంకు గాని కంట్రోల్ చెయ్యదు. అలాగే ఫిసికల్ గా కాయిన్లు గాని, నోట్లు గాని ఉండవు.

ప్రస్తుతం ఇప్పుడు ఒక Bitcoin విలువ 9500 డాలర్లుగా ఉంది. అంటే మన రూపాయల్లో 7 లక్షల 20 వేల రూపాయల పైనే. కానీ ఒకవేళ మనం Bitcoin విలువ కొనాలంటే అంత డబ్బు పెట్టవలసిన అవసరం లేదు. ఒక రూపాయకు 100 పైసలు ఎలాగో అలా ఒక Bitcoin కి 10 కోట్ల సతోషీలు ఉంటాయి. కాబట్టి మన దగ్గర ఎంత డబ్బు ఉంటె దానికి సరిపడ సతోషీలు కొనుకోవచ్చు.

ఇది Bitcoin విలువ ఎలా పెరిగిందో చూపించే చార్ట్.

ఈ Bitcoin ద్వారా డబ్బులు పంపితే డబ్బులు పంపిన వ్యక్తి వివరాలు ని, రిసీవ్ చేసుకున్న వ్యక్తి వివరాలు గాని ఎవరికి తెలియదు.

అందుకే హ్యాకర్లు కూడా ఈ Bitcoin ద్వారా పేమెంట్ చెయ్యమని అడుగుతుంటారు. ఈ Bitcoin ద్వారా ఎవరైనా, ఎంత డబ్బు అయినా, ఎక్కడికైనా సులభంగా డబ్బుని పంపుకోవచ్చు. Transaction Charges కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీని ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు, పేమెంట్ చేసుకోవచ్చు. ఇప్పటికే Microsoft, Tesla, Dell, Lamborghini వంటి కంపెనీలు కూడా ఈ Bitcoin ని accept చేస్తున్నాయి.

2018 వ సంవత్సరంలో మన RBI బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ ని కొనడానికి అమ్మడానికి వీలు లేకుండా బ్యాంకు లకు నిబంధనలు విధించింది. ఈ విధంగా RBI నిషేధం విధించడంతో మనం దేశంలో చాలాకాలం పాటు క్రిప్టో కరెన్సీ చెలామణి ఆగిపోయింది. కానీ 2020 లో సుప్రీం కోర్ట్ ఈ నిషేధాన్ని ఎత్తివేసి Bitcoin వంటి క్రిప్టో కరెన్సీ ని కొని అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చింది. దానితో చాలా మంది మరలా Bitcoin కొనడానికి మొగ్గు చెపుతున్నారు.

నిరంతరం ఈ Bitcoin విలువ అమాంతంగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. అలాగే ఈ బిట్ కాయిన్ ని ఎవరు నడిపిస్తున్నారు? ఎక్కడి నుండి నడిపిస్తున్నారు అనేది తెలియదు కాబట్టి దీనిలో కొంచెం రిస్క్ ఉంది. కాబట్టి దీనిలో పెట్టుబడి పెట్టేముందు ఒకసారి ఆలోచించి పెట్టుబడి పెట్టండి.

అయితే ఇప్పటికే ఒకసారి ఈ Bitcoin విలువ $19,783 వరకు చేరుకొని ఇప్పుడు కొంచెం తగ్గింది. భవిష్యత్తులో దీని విలువ 1,00,000 డాలర్లకు కూడా చేరుకునే అవకాశం కూడా ఉంది అని కొంతమంది అభిప్రాయం.

Bitcoin ఎలా కొనాలి? (How to Buy Bitcoin)

కేవలం ఈ Bitcoin మాత్రమే కాదు Ethereum, Lightcoin, Ripple వంటి చాలా రకాల Cryptocurrency లు ఉన్నాయి. ఒకవేళ మీరు వీటిని కొనాలనుకుంటే మన ఇండియాలో WazirX అనే వెబ్సైటు ద్వారా కొనుక్కుని దాచుకోవచ్చు. ఆ తరువాత వాటి విలువ పెరిగిన తరువాత అమ్ముకోవచ్చు.

ఒకవేళ మీరు Bitcoin కొనుక్కోవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి Bitcoin కొనుక్కోండి.

<< Register Now >>

You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+