ratan-tata-telugu

Wipro Success Story in Telugu

WIPRO Success Story in Telugu

సబ్బుల నుంచి సాఫ్ట్ వేర్ రంగం వరకు విస్తరించిన వ్యాపార సామ్రాజ్యానికి రారాజు ఆయన. వ్యాపారవేత్తగా ఆయన సాధించిన విజయాలు మాత్రమే కాదు, వితరణశీలిగా ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలు కూడా ఆయన ఔన్నత్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. భారత ఐటీ రంగంలో మకుటం లేని మహారాజుగా గుర్తింపు పొందిన అజీమ్ ప్రేమ్ జీ దేశప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన పారిశ్రామికవేత్తల్లో అగ్రగణ్యుడు. ఐటీ రంగంలో భారత్ సాధించిన పురోగతిలో ఆయన పాత్ర కీలకం.

ఇన్ని విజయాలను సాధించిన మరియు WIPRO అధినేత అయినటువంటి అజీమ్ ప్రేమ్ జీ సక్సెస్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం..

అజీమ్ ప్రేమ్ జీ 1945 జూలై 24న మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా అమల్నేర్ పట్టణంలో పుట్టారు. తండ్రి మహమ్మద్ ప్రేమ్ జీ, వ్యాపారవేత్త. బియ్యం వ్యాపారంలో ఆరితేరిన ఆయన 'రైస్ కింగ్ ఆఫ్ బర్మా'గా పేరుపొందారు. అజీమ్ పుట్టిన కొద్ది నెలల్లోనే ఆయన 'వెస్టర్న్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్ లిమిటెడ్' కంపెనీని ప్రారంభించారు. తర్వాతి కాలంలో ఇదే 'WIPRO'గా రూపాంతరం చెందింది.

తొలినాళ్లలో ఈ కంపెనీ ముంబైలో కర్మాగారాన్ని ఏర్పరచుకుని, శాకాహార నూనెలను, రిఫైన్డ్ నూనెలను ఉత్పత్తి చేసేది. కొంతకాలం తర్వాత వనస్పతి, డిటర్జెంట్ సోప్ ల తయారీ కూడా ప్రారంభించింది. ఒకవైపు వ్యాపార విస్తరణను కొనసాగిస్తూనే, కొడుకు అజీమ్ ను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపారు మహమ్మద్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరారు అజీమ్. అయితే, 1966లో మహమ్మద్ ప్రేమ్ జీ ఆకస్మికంగా మరణించారు. తండ్రి మరణంతో అజీమ్ చదువును అర్ధంతరంగానే వదిలేసి భారత్ కు రావాల్సి వచ్చింది. 'విప్రో' విస్తరణ పర్వం తండ్రి వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా 'విప్రో' పగ్గాలు చేపట్టారు అజీమ్.

అప్పటికి ఆయన వయస్సు కేవలం 21 ఏళ్లే. స్వతహాగా తెలివైన అజీమ్ త్వరగానే వ్యాపారం మెలకువలను ఆకళింపు చేసుకున్నారు. 'విప్రో' విస్తరణను వేగవంతం చేశారు. సబ్బులు, షాంపూలు, బేబీ ప్రోడక్ట్స్, బల్బులు వంటి వాటి ఉత్పత్తి మొదలుపెట్టారు. అనతికాలంలోనే 'విప్రో' ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఆదరణ చూరగొన్నాయి. ఇలా సాగుతుండగా, 1980లలో దేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు అడుగులు వేయడం మొదలైంది. ఈ తరుణంలోనే 'విప్రో' ఐటీ రంగంలోనూ అడుగు పెట్టింది. అమెరికన్ కంపెనీ 'సెంటినెల్'తో ఒప్పందం కుదుర్చుకుని కంప్యూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో, అజీమ్ ప్రేమ్ జీ తన దృష్టిని ఎక్కువగా సాఫ్ట్వేర్ అభివృద్ధిపై సారించారు.

ఐటీ రంగంలో 'విప్రో' ఘనవిజయాలతో రెండు దశాబ్దాలు గడిచేలోగానే దేశంలోని అపర కుబేరుల్లో ఒకరిగా ఎదిగారు. ఈ ప్రస్థానంలో అజీమ్ ప్రేమ్ జీ ని 'పద్మవిభూషణ్' సహా లెక్కలేనన్ని పురస్కారాలు కూడా వరించాయి. పలు వర్సిటీలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి.

సామాన్య స్థాయి నుంచి అతిసామాన్య స్థాయికి ఎదిగిన అజీమ్ ప్రేమ్ జీ యొక్క జీవితం మన అందరికీ ఆదర్శప్రాయం. ఓకే ఫ్రెండ్స్ మరిన్ని Success Stories కోసం Telugubadi.in సందర్శిస్తూ ఉండండి.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+