ratan-tata-telugu

WhatsApp Successful Story in Telugu - StartUp in Telugu

ఈ రోజులలో అత్యంత ప్రజాదరణ పొందిన App ఏమైనా ఉంది అంటే అది ‘WhatsApp’ అనే చెప్పవచ్చు Play Store లో కొన్ని వందల మెసేజింగ్ App లు ఉన్నప్పటికీ వాటిలో మొదటి ప్రాధాన్యత మాత్రం అందరం ‘WhatsApp’ కే ఇస్తుంటాం.

ఏ మాధ్యమాలలో కూడా WhatsApp గురించిన advertisement లను మచ్చుకు ఒక్కసారి అయినా మనం చూసి ఉండం. అసలు ఎటువంటి advertisement లు లేకుండా WhatsApp అంత ఫేమస్ ఎలా అయ్యింది? దాని యొక్క Successful Story ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

Jhon koum మరియు Briyan Acton అనే ఇద్దరి మిత్రుల యొక్క ఎన్నో నిద్రలేని రాత్రుల కష్ట ఫలితమే ఈ WhatsApp. అంతే కాదు మనకి నిద్ర లేకుండా చేస్తోంది కూడా అదే…

వీరు ఇద్దరు Yahoo లో సుమారు 9 సంవత్సరాలు కలిసి పనిచేశారు. తరువాత వాళ్ళ జీవితంలో ఏదో కోల్పోయినట్లు అనిపించి, ఇద్దరూ Yahoo లో ఉద్యోగం వదిలేసి ప్రపంచ పర్యటనకు బయలుదేరారు. ఒక సంవత్సరం తరువాత వారి దగ్గర ఉన్న డబ్బు కాస్తా అయిపోవడంతో ఇద్దరూ మళ్ళీ ఉద్యోగం కోసం Facebook ఇంటర్వ్యూ కి వెళ్లారు. కానీ, ఇద్దరూ ఇంటర్వ్యూ లో Reject అయ్యారు.

అయితే ప్రపంచ పర్యటనలో భాగంగా వీరు వివిధ దేశాలు తిరుగుతున్న సమయంలో వేరే దేశంలో ఉన్న వారితో మాట్లాడాలి అంటే చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉండవలసి వచ్చేది .

వేరే దేశం వారితో మాట్లాడాలి అంటే ఆ దేశం యొక్క code తెలియాలి, ఫోన్ నెంబర్ తెలియాలి… ఒకవేళ నెంబర్ ఉన్నా కూడా అవతలి వాళ్ళు Available గా ఉన్నారో లేక Busy గా ఉన్నారో తెలియదు… మెసేజ్ చేద్దామంటే అప్పట్లో cost ఎక్కువ మరియు అప్పట్లోని ఫోన్లలో మెసేజ్ లు అనేవి ఒక్కొక్కటిగా వచ్చేవి. అది కూడా ఒక మెసేజ్ కి వచ్చి 160 లెటర్స్ లిమిట్ అనేది ఉండేది. అలా కాకుండా ఒకే నెంబర్ నుంచి వచ్చే మెసేజ్ లు అన్ని ఒకే పేజీలో వచ్చి.. అవతలి వ్యక్తి యొక్క పరిస్థితి Avaialbe, Busy, At work, In meeting మనకి తెలిసేలా… మరియు మెస్సేజ్ లు పంపుకునేలా ఉండే ఒక Messaging App ఏమైనా తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన Jhon కి వచ్చింది. ఈ ఆలోచనను తన స్నేహితుడు అయిన Briyan Acton తో పంచుకున్నాడు John.

Briyan కి కూడా ఈ ఆలోచన నచ్చడంతో వీరు ఇద్దరు దాని మీద దృష్టి పెట్టి App ని డిజైన్ చేసారు.

అంతా పూర్తి అయ్యిన తరువాత దానికి ‘WhatsApp’ అని పేరు పెట్టి, వాళ్ళ స్నేహితులందరిని కూర్చోపెట్టి ఈ App ఎలా పనిచేస్తుంది, లాభాలేమిటి అనేవి స్పష్టంగా చెప్పారు.

కానీ…WhatsApp ను వాడటం వల్ల మొబైల్ ఛార్జింగ్ త్వరగా తగ్గిపోవడం, అప్పట్లో Push Notification ల వంటి సదుపాయాలు లేనందువల్ల దీనిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.

దీనితో విచారణ పొందిన John ఇవన్నీ వదిలేసి ఏదైనా ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. కానీ, Briyan తనకి నచ్చజెప్పి కొంచెం స్ఫూర్తిని ఇస్తాడు.

ఇది జరిగిన కొన్ని నెలలకి Apple కంపెనీ push Notifications ని లాంచ్ చేస్తుంది.

దీనితో జాన్ స్నేహితులు కొందరు WhatsApp ని వాడటం మొదలుపెడతారు. అప్పటి వరకు ఎవరికీ తెలియని Status లు, Threatning messages, వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడానికి గల ఆప్షన్ల ను చూసి WhatsApp వాడటానికి కొందరు ఆసక్తి చూపిస్తారు.

దీనితో కొంచెం దైర్యం వచ్చిన జాన్, మరియు కౌమ్ లు.. “ఎటువంటి యాడ్ లుగానీ , గేమ్స్ గానీ , జిమ్మిక్స్ గానీ లేనటువంటి… User Friendly గా ఉండే విధంగా WhatsApp ను రూపొందించారు.

యాడ్స్ లేకుండా వాళ్లకి డబ్బులు రావన్న విషయం వాళ్లకి తెలియనదేమీ కాదు. కానీ మనకి ఇష్టమైన వారితో మెస్సేజ్ చేస్తూ ఉన్న సమయంలో యాడ్స్ వస్తే అది ఎంత చిరాకుని రప్పిస్తుంది అన్నది మాటల్లో చెప్పలేనిది.

అందుకే యాడ్స్ ద్వారా కాకుండా iphone users కి మొదట్లో Installation charges ద్వారా మరియు Android Users కి ఒక సంవత్సరం అయిన తరువాత charge చేయడం ద్వారా డబ్బు సంపాదిద్దామని అనుకున్నారు జాన్ మరియు కౌమ్.

2009 మరియు 2010 లో ఎక్కువ Downloads అవ్వడంతో అధిక మొత్తంలోనే డబ్బుని సంపాదించారు.

ఇలా WhatsApp కి రోజు రోజుకీ ప్రజాదరణ పెరుగుతుండటంతో Facebook 2014 ఫిబ్రవరిలో 19.6 బిలియన్ డాలర్లని ఇచ్చి WhatsApp కొనుగోలు చేసింది. అప్పట్లోనే Technology రంగంలోని కనీ..వినీ.. ఎరుగనంత పెద్ద డీల్ అది.

ఒక్క డీల్ తో జాన్ మరియు కౌమ్ లు ప్రపంచ కుబేరుల జాబితాలలో చేరిపోయారు.

చూడండి ఫ్రెండ్స్… ఒకప్పుడు వాళ్ళని Reject చేసిన Facebook నే, వాళ్ళ దగ్గరకి వచ్చేలా చేసుకున్నారంటే అంతకు మించిన సక్సెస్ ఇంకేం ఉంటుంది?

ఈరోజున మెస్సేజింగ్ యాప్ No.1 స్థానంలో ఉంది WhatsApp. కౌమ్ కూడా బయపడి వదిలేసి ఉంటే ఈరోజున మనకి ఇంతమంచి మెసేజింగ్ యాప్ ఉండేది కాదు, వాళ్ళు కూడా కోటీశ్వరులు అయ్యేవారు కాదు…

మనలో కూడా చాలా మంది.. వాళ్లలో ఇలాంటి గొప్ప ఆలోచనలు ఉన్నా కూడా… వాటికి ఎదురయ్యే సమస్యలకి భయపడి వదిలేస్తున్నారు…

పట్టుదల మరియు సహనంతో పని చేస్తే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది తెలియడానికి ‘WhatsApp Story’ నే మనకి స్ఫూర్తిదాయకం.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+