ratan-tata-telugu

Why Startups Fail - Top 6 Reasons Startups Fail in Telugu

ఒక్కొక్కసారి మనం ఎన్నో ఆశలతో మొదలు పెట్టిన స్టార్ట్ అప్స్ (Startups) ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఒక సర్వే ప్రకారం 90% స్టార్ట్ అప్ లు మొదలుపెట్టిన మొదటి 3 సంవత్సరాలలోనే ఫెయిల్ అవుతున్నాయట. ఈ రంగంలో గెలుపు ఓటములు అనేవి సహజం కానీ ఎవరు కూడా ఓటమి పొందాలనుకోరు. ముఖ్యంగా తెలివైనవాళ్ళు ఇతరుల తప్పుల నుండి నేర్చుకుంటారు. ఆ తప్పులు వాళ్ళు చెయ్యకుండా తప్పించుకుంటారు. అందుకోసం అసలు స్టార్ట్ అప్ లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో తెలుసుకుంటే మనం ఆ తప్పులు చెయ్యకుండా ఉండవచ్చు. కాబట్టి స్టార్ట్ అప్ లు ఫెయిల్ అవ్వడానికి గల ముఖ్య కారణాలేంటో తెలుసుకుందాం.

1. అవసరం లేని  ప్రొడక్ట్ ను లేదా సేవలను ప్రారంభించడం:

ఒక స్టార్ట్ అప్ ఫెయిల్ అవ్వడానికి అతి ముఖ్యమైన కారణం ఇదే. స్టార్ట్ అప్ అంటేనే మార్కెట్ లో ఉన్న సమస్యను కనిపెట్టి దానికి సరైన పరిష్కారాన్ని అందించడం. కాని చాలా మంది ఒక ప్రదేశంలో లేదా ఆ సమయానికి అవసరం లేని ప్రొడక్ట్ ని లేదా సేవలను ప్రారంభించి చేతులు కాల్చుకుంటారు. అలాగే మన ప్రొడక్ట్ కన్నా ఇంకా మంచి ప్రొడక్ట్ లేదా సర్వీస్ మార్కెట్ లో ఉన్నప్పుడు మన స్టార్ట్ అప్ ఫెయిల్ అవుతుంది.

2. సరిపడినంత పెట్టుబడి లేకపోవడం:

స్టార్ట్ అప్ మొదలు పెట్టేటప్పుడు ఒక అంచనా వేసుకుని కొంతపెట్టుబడితో రంగంలోకి దిగుతారు. ఒక్కొక్కసారి తమ పెట్టుబడి అంతాకూడా అయ్యిపోతుంది. కంపెనీ ని ముందుకు నడపడానికి కావాల్సిన నిధులు లేక మధ్యలోనే చాలా స్టార్ట్ అప్ లు మూతపడుతుంటాయి. కాబట్టి స్టార్ట్ అప్ ని నడిపేవారు కష్ట కాలం లో గట్టెక్కడానికి గాని, లేదా వ్యాపారాన్ని మరింత విస్తరింపచెయ్యడానికి నిధుల(Funds) కోసం ఇన్వెస్టర్ లను వెతుక్కుంటూ ఉండాలి.

3. సరైన టీం లేకపోవడం:

ఒక స్టార్ట్ అప్ రన్ చెయ్యడంలో అతి ముఖ్యమైన మరియు కష్టమైన పని ఇదే. మన టీం లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. కాబట్టి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు బృందంలోని అందరి భావాలను అడిగితెలుకోవాలి. టీంలో ఒకరు ఎక్కువ పని చేస్తున్నారు, మరొకరు తక్కువ పనిచేస్తున్నారు అనే భావన కలిగితే బిజినెస్ ని ముందుకు తీసుకువెళ్లడం చాలా కష్టం. కాబట్టి టీంలో అందరి మధ్య మంచి అనుబంధం తప్పనిసరి. అలాగే ఉద్యోగుల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నైపుణ్యం లేని వారిని ఎంచుకుంటే తరువాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

4. మార్కెటింగ్ లేకపోవడం:

మనం ఎంత గొప్ప ప్రొడక్ట్ లేదా సర్వీస్ ని ప్రారంభించిన దాని గురించి ఎవరికీ తెలియకపోతే అది కనుమరుగైపోతుంది. మనదంటూ ఒక ప్రొడక్ట్ ఉందని ప్రపంచానికి తెలిసేది మార్కెటింగ్ (Marketing)  ద్వారానే... అందుకే పేరు ప్రఖ్యాతలు గడించిన పెద్ద పెద్ద కంపెనీలు కూడా మార్కెటింగ్ కోసం కొన్ని కోట్లు ఖర్చుచేస్తూ ఉంటాయి. మార్కెటింగ్ వల్ల మన బ్రాండ్ విలువ పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒక స్టార్ట్ అప్ కి మార్కెటింగ్ తప్పనిసరి.

5. కస్టమర్స్ ని పట్టించుకోకపోవడం:

మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు మన కస్టమర్ ల అవసరాలను తీర్చడం, అలాగే తిరిగి వారి నుండి అభిప్రాయాలను స్వీకరించడం అనేది చాలా ముఖ్యం. వాళ్ళు ఇచ్చే ఫీడ్ బ్యాక్(Feedback)  ద్వారా మనం ఎక్కడ వెనకబడి ఉన్నాం, ఏ విభాగంలో మనల్ని మనం సరిదిద్దుకోగలమో తెలుస్తుంది. ఆ ఫీడ్ బ్యాక్ ఆధారంగా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మనం మారాలి. అలాగే కస్టమర్స్ దగ్గర నుండి మనం ఫీడ్ బ్యాక్ తీసుకోవడం వలన మనం వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇస్తున్నామని వాళ్లకు అర్ధమవుతుంది. దానివల్ల వాళ్ళకి మన పై నమ్మకాన్ని పెరుగుతుంది.

5. చట్టపరమైన తప్పులు చేయడం:

కొంతమంది తెలిసో తెలియకో కొన్ని చట్టపరమైన తప్పులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి అప్పటికే ఉన్నటువంటి పేరు మీదే మళ్ళీ స్టార్ట్ అప్(Startup) ని మొదలుపెట్టడం, లేదా ఇతరుల లోగోలు వాడడం, ప్రభుత్వం నుండి కావలసిన పర్మిషన్ లు, లైసెన్స్ లు తీసుకోకపోవడం మొదలైనవి. కాబట్టి ముందుగానే అన్నీ చెక్ చేసుకుని మొదలుపెట్టడం మంచిది. లేకపోతె తరువాత వీటి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యల వలన మూతపడిన కంపెనీలు చాలా ఉన్నాయి.

ఇవే కాదు చేస్తున్న పనిమీద అభిరుచి (passion) లేకుండా కేవలం డబ్బు కోసం స్టార్ట్ అప్ పెట్టడం, ఫోకస్ తప్పడం, బిజినెస్ మోడల్ (Business Model) లేకపోవడం, పరిస్థితులకు తగ్గట్టుగా మారకపోవడం, ఇన్నోవేటివ్ గా ఆలోచించకపోవడం ఇవన్నీ కూడా స్టార్ట్ అప్ లు విఫలమవడానికి కారణాలు. కాబట్టి పైన చెప్పిన వాటిని దృష్టిలో పెట్టుకోవాలి.

ఓటములనేవి సహజం. అటువంటి సమయంలో ఆగిపోకుండా వాటి నుండి కొత్త పాఠాలు నేర్చుకుంటూ మరిన్ని కొత్త ఆలోచనలతో, మరింత ఉత్సాహంతో ముందుకు సాగిపోవాలి.



Suggested Books:

 

You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+