ratan-tata-telugu

How to Learn English at Home with 7 Simple Steps - Telugu Badi

How To Speak Fluent English?

వేగంగా పరుగులు తీస్తున్న ఈ ప్రపంచంలో ఇంగ్లీష్ (English)  భాష తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. విద్య పరంగా జ్ఞానం, సామజిక అవగాహన, తెలివితేటలు ఉన్నప్పటికీ ఇంగ్లీష్ రాకపోవడంతో చాలా మందిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది అలాగే మిగిలిన వారితో పోల్చితే వెనుకపడుతున్నారు. చాలా మందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉన్నప్పటికీ ఎలా మొదలు పెట్టాలి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సులభమైన మార్గాలు ఏంటో తెలియక కొంత మంది డీలా పడిపోతుంటారు. అలాంటి వారికోసం ఈ ఆర్టికల్ రాయబడింది. దీనిలో మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు (Simple steps to Learn English) తెలుసుకుందాం.

1. ధృఢమైన సంకల్పం:

మనం ఏ పనిలో విజయం సాధించాలన్నా కూడా మనకు ఒక పట్టుదల అనేది ఎంతో అవసరం. మీరు నేర్చుకోవాలి అని ఎంత గట్టిగా ప్రయత్నిస్తే అంత త్వరగా నేర్చుకోగలరు. మొదట్లో చాలా మంది ఎంతో ఉత్సాహంతో మొదలుపెడతారు కానీ క్రమక్రమంగా ఆ ఉత్సాహం తగ్గిపోతుంది. దానికి కారణం ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే దానిని ఒక కష్టమైన బాధ్యతగా చూడకుండా ఒక ఆట లాగ సరదాగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ముందు ఇంగ్లీష్ పెంచుకోండి. ఇష్టంతో చేసేపని ఎంత చేసేపు చేసిన బోర్ కొట్టదు.

2. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ని చదవడం:

ఇంగ్లీష్ న్యూస్ పేపర్లను ను చదవడం చాలా మందికి అలవాటు ఉండకపోవచ్చు. కానీ మీరు గనుక ఇంగ్లిష్ న్యూస్ పేపర్ చదవడం మొదలుపెడితే, కొత్త కొత్త పదాలు కనిపిస్తాయి, వాటి అర్థాలు తెలుసుకుంటూ మీ Vocabulary ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ నేర్చుకునే మొదటి స్టేజి లో ఉన్నట్టయితే సింపుల్ వాక్యాలను ముందు నేర్చుకుని తర్వాత న్యూస్ పేపర్ ని చదవండి. మీకు బాగా ఉపయోగపడగల కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు Hindu, Indian Express, Tribune, Times of India.

3. సినిమా, వెబ్ సిరీస్ ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ (English Subtitles) తో  చూడటం:

చాలా మంది వేరే భాష లలో సినిమా లు చూడటానికి ఇష్టపడరు, కారణం వాళ్లకు ఆ భాష రాకపోవడమే! కానీ మీరు అలాంటి సినిమాలను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడటం అలవాటు చేసుకుంటే మీరు ఇంగ్లీష్ భాష మీద పట్టు ని మరింత పెంచుకోవచ్చు. సబ్ టైటిల్స్ లో వాడే ఇంగ్లీష్ చాలా శాతం సులభంగా ఉంటుంది. మీరు ఇంకా బాగా నేర్చుకోవాలి అనుకుంటే మొదట్లో తెలుగు సినిమాలనే సబ్ టైటిల్స్ తో చూస్తూ, మీరు చూసేదానికి సబ్ టైటిల్స్ ని మ్యాచ్ చేసుకుని, నేర్చుకోవచ్చు.

4. ఇంగ్లీష్ బుక్స్ (English Books) చదవడం:

ఒక ఇంగ్లీష్ వాక్యాన్ని ఎంత బాగా మనం నిర్మించవచ్చు అని ఇంగ్లీష్ బుక్స్ ని చుస్తే మనకు అర్థం అవుతుంది. ఇంగ్లీష్ లో కి అనువదింపబడిన రచనలు మీరు చదివితే సులువుగానే అర్థం అవుతాయి, మీకు కూడా Vocabulary మీద పట్టు వస్తుంది, పర్యాయ పదాలు కూడా ఎన్నో తెలుసుకోవచ్చు. ఇంగ్లీష్ బుక్స్ చదివేటప్పుడు మీకు చాలా సందేహాలు వస్తాయి, అంటే ఈ వాక్యాన్ని ఇలా కూడా రాయవచ్చా? ఈ పదాల్ని ఈ సందర్భంలో కూడా ఉపయోగించవచ్చా? ఇలాంటి మీ సందేహాలను తీర్చుకోవడానికి మీరు ఇంటర్నెట్ ద్వారా గాని ఇంగ్లీష్ బాగా తెలిసిన వాళ్ళ ద్వారా గాని తెలుసుకోవచ్చు.

5. పిల్లల పుస్తకాలు చదవటం:

పైన చెప్పిన వాటి కంటే ఇది సులువైన, తేలికైన పద్ధతి. నేటి తరం పిల్లల్లో ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం చదువుతున్నవారే! మీరు ఒకసారి వారి పుస్తకాలు చూసినట్లయితే ఇంగ్లీష్ ఎంత సులభంగా ఉంటుందో అర్ధం అవుతుంది. చిన్న చిన్న కథలు, వ్యాసాలు, పద్యాలు మీ ఇంగ్లీష్ కు బలమైన పునాదిని వేస్తాయి. నేనేంటి పిల్లల బుక్స్ చదవడం ఏంటి అని అనుకోవద్దు, సులువైన రీతిలో మీకు ఇంగ్లీష్ నేర్పగలిగేది ఆ చిన్న పిల్లల పుస్తకాలే!

6. మాట్లాడటం (Speaking) ఒక గొప్ప సాధనం:

నేర్చుకున్నదానిని ఆచరణలో పెట్టకపోతే మనం ఎంత నేర్చినా అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఈత ఎలా నేర్చుకోవాలి అనే పుస్తకం 100 సార్లు చదివితే ఈత రాదు. నీటిలో దిగి ఈత కొడితేనే ఈత వస్తుంది. అలాగే ఇంగ్లీష్ కూడా ఎంత గ్రామర్ నేర్చుకున్న ఇతరులతో మాట్లాడడం ప్రాక్టీస్ చెయ్యకపోతే ఇంగ్లీష్ పూర్తిగా నేర్చుకోలేరు. కాబట్టి, నేర్చుకునప్పుడే వేరే వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటే మీ తప్పుల్ని తెలుసుకుని మీ ఇంగ్లీష్ ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. చాట్ చేసేప్పుడు కూడా ఇంగ్లీష్ ఉపయోగిస్తే తొందరగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.

7. ఒక గ్రూప్ గా ఏర్పడండి:

సాధారణంగా ఇంగ్లీష్ నేర్చుకునే సమయంలో మనం ఎవరితోనైనా మాట్లాడితే అపహాస్యం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ కారణం చేత చాలామంది ఇంగ్లీష్ (English) లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు. అందుకే మీ స్నేహితులలో ఎవరైతే మీ లాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వాళ్లంతా కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడడండి. ప్రతి రోజు కొంత సమయం కేటాయించుకుని ఒకరితో ఒకరు ఇంగ్లీష్ లో మాట్లాడుకోండి. దీని వలన మీరు ఏదైనా తప్పు చేస్తే ఇతరులు వాటిని సరిదిద్దుతారు.

ఈ విధంగా పైన చెప్పిన విధంగా ఇంగ్లీష్ ని ఇష్టపడి నేర్చుకోండి. మీ స్నేహితులలో కూడా ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునేవారు ఉంటె ఈ పోస్ట్ ని వాళ్ళతో షేర్ చెయ్యండి.

ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు (Best Books to Learn English):

         

You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+