ratan-tata-telugu

గ్యాస్ సిలిండర్ పైన ఉండే మూడు అక్షరాల కోడ్ కి అర్ధం ఏంటి? What is the meaning of the Number on Gas Cylinder - Telugu Badi


గ్యాస్ సిలిండర్ పైన ఉండే మూడు అక్షరాల కోడ్ కి అర్ధం ఏంటి?

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో కూడా Gas Cylinder ని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రతి Gas Cylinder పైన ఒక కోడ్ ఉంటుంది. దానికి అర్ధం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్స్ అన్ని కూడా ఎంతో ప్రెషర్ ని తట్టుకునేలా చాలా స్ట్రాంగ్ గా తయారు చేస్తారు. అయితే రోజులు గడిచే కొద్దీ బయట ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా గాని, లేదా సిలిండర్ ని వాడే విధానం బట్టి గాని, సిలిండర్ తుప్పు పట్టడం, లేదా పగుళ్లు రావడం లేదా పాడవడం జరుగుతుంది.

అలా పాడైన సిలిండర్ లను ఉపయోగిస్తే గ్యాస్ లీక్ అవ్వడం గాని సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం గాని జరుగుతుంది. కాబట్టి సిలిండర్ ని కొన్ని సంవత్సరాలకి ఒకసారి తప్పకుండ టెస్ట్ చేయాలి అని ఒక రూల్ ఉంది.

సాధారణంగా ఒక సిలిండర్ కి లైఫ్ 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ 15 సంవత్సరాలలో దానిని 2 సార్లు టెస్ట్ చేస్తారు. అయితే ఏ ఏ టైం కి ఆ సిలిండర్ టెస్ట్ చెయ్యాలి అని తెలిపేది ఆ కోడ్.

మనం చూసే ఈ కోడ్ లో ABCD వీటిలో ఏదో ఒక లెటర్ ఉంటుంది. దాని పక్కన నెంబర్ ఉంటుంది. దీనిలో A B C D అనే లెటర్స్ నెలలను సూచిస్తాయి.

A లెటర్ January నుండి March వరకు మూడు నెలలను ని సూచిస్తుంది.
B లెటర్ April నుండి June వరకు
C లెటర్ July నుండి September వరకు
D లెటర్ October నుండి December వరకు ఇలా ప్రతి అక్షరం 3 నెలలను సూచిస్తాయి.

పక్కన రెండంకెల నెంబర్ అనేది సంవత్సరాన్ని indicate చేస్తుంది.

ఇప్పుడు ఉదాహరణకు ఒక Gas Cylinder మీద A 22 అని ఉంది అనుకుందాం. A అనే లెటర్ January నుండి March ఈ 3 నెలలని indicate చేస్తుంది. చివరిలో ఉన్న 22 అనేది 2022 సంవత్సరం అని. కాబట్టి ఆ సిలిండర్ ని 2022 లో January నుండి March లోపు టెస్టింగ్ కోసం పంపాలి.

For Example ఒకవేళ C 24 అని ఉంటె 2024 సంవత్సరం లో July నుండి September నెలల్లో ఆ సిలిండర్ ని టెస్టింగ్ కి పంపాలి.

అలా టెస్టింగ్ కి పంపినప్పుడు అక్కడ వాటర్ ద్వారా Hydro test చేసి ఎక్కడైనా లీక్ ఉందేమో చెక్ చేస్తారు. అలాగే pneumatic test చేసి సిలిండర్ లో ఉండే నార్మల్ ప్రెషర్ కన్నా 5 రెట్లు ఎక్కువ ప్రెషర్ ని అప్లై చేసి టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ లలో కనుక సిలిండర్ కి లీక్ ఉన్నట్టు గాని, డేమేజ్ అయినట్టు గాని తెలిస్తే దానిని స్క్రాప్ కి పంపిస్తారు.

అలా కాకుండా సిలిండర్ ఏమీ పాడవకుండా అంతా బాగానే ఉంటే దానికి పెయింట్ వేసి నెక్స్ట్ టైం మళ్ళీ దానిని ఎప్పుడు టెస్ట్ చెయ్యాలి అనేది ఈ కోడ్ రూపంలో ప్రింట్ చేస్తారు.

కాబట్టి మనం గ్యాస్ సిలిండర్ తీసుకునే సమయంలోనే ఒకసారి ఈ కోడ్ ని చెక్ చేసుకుని తీసుకోవడం మంచిది. ఒకవేళ అలా టెస్ట్ చెయ్యని లేదా డేట్ దాటిపోయిన సిలిండర్ వస్తే వెంటనే గ్యాస్ డెలివరీ బాయ్ కి చెప్పి ఆ సిలిండర్ ఇచ్చేసి వేరొకటి తీసుకోవాలి. దాదాపుగా టెస్ట్ చేయని సిలిండర్ లు రావు. కంపెనీ వాళ్ళే చెక్ చేసి పంపిస్తారు. ఇలాంటివి చాల అరుదుగా వస్తుంటాయి. కాబట్టి ఒకసారి చూసుకోవాలి.

కాబట్టి ఈ నెంబర్ అనేది Gas Cylinder కి తప్పకుండా చేయవల్సిన టెస్ట్ కి సంబంధించిన గడువుని తెలిపే నెంబర్ దీని గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చెయ్యండి.




You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+