ratan-tata-telugu

Tips to Get Succeed in Your Career in Telugu

కొంతమంది యువకులు జీవితంలో ఏదో సాధించాలనే నెపంతో ముందుకు నడుస్తుంటారు. మరికొందరు జీవితంలో ఏది దొరికితే దానితోనే సంతృప్తిని పొందుతుంటారు. మరికొందరు విభిన్నంగా చేస్తున్న పనిలోను, ఉద్యోగంలోను ఒక మంచి ఉన్నత స్థానాన్ని పొందాలని అనుకుంటుంటారు. ఏ రంగంలోవారైనా సరే.. అందులో తమదైన విజయాన్ని, గుర్తింపును సాధించాలనే తపన ప్రతిఒక్కరిలో ఉంటుంది. ఈరోజుల్లో ఉద్యోగంలో విజయం మరియు గుర్తింపు అనేది మనం చేసే పనితో పాటుగా మనం మన సహోద్యోగులతో మరియు మన పై అధికారులతో ఎలా మసులుకుంటున్నాం అనేదాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ రోజులకు తగ్గట్టుగా ఉద్యోగంలో ఎలా మసులుకోవాలో ఇప్పుడు చూద్దాం..

1. మీ సహోద్యోగులు, మీ పై అధికారులు మీ మీద ఆధారపడేలా చేసుకోండి. మీ సాయం లేకుండా పని చేసేలాగా అన్ని పనులు వాళ్లకి నేర్పకండి. ఇతరులు మీ మీద ఆధారపడినప్పుడే మీకు గుర్తింపు ఉంటుంది అన్న విషయం గుర్తుంచుకోండి.

2. మీరు ప్రపంచానికి లేదా మీ సంస్థకు అందించేది అరుదుగా ఉండేట్టు, ఎక్కడా దొరకదు అనేట్టు చూసుకోండి. తక్షణం సంస్థలో మీ విలువ పెరిగిపోవడాన్ని మీరే గమనిస్తారు.

3. వాదనతో కాదు, మీ చేతలతో గెలవండి. వాదన ద్వారా మీరు క్షణికంగా సాధించే విజయం నిజంగా గెలుపు అనిపించుకోదు.

4. మీరు కలుసుకునే ఒక్కొక్క వ్యక్తికీ తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. గంభీరంగా ఉండేవాళ్ళతో గంభీరంగాను, సరదాగా ఉండేవాళ్ళతో సరదాగానూ ఎప్పటికప్పుడు విచక్షణా జ్ఞానంతో మీ ధోరణిని మార్చుకుంటూ ఉండండి.

5. మీరు ప్రవర్తించే తీరుని బట్టి అందరూ మీతో ఎలా ఉంటారనేది నిర్ణయించబడుతుంది. సామాన్యుడిలా కనిపిస్తే మిమ్మల్ని గౌరవించడం తగ్గిస్తారు. ఒక రాజు తనని తాను గౌరవించుకుంటాడు కాబట్టే ఇతరుల్లో కూడా అదే భావాన్ని ప్రేరేపిస్తాడు.

6. కిరీటం(Designation) మిమ్మల్ని మిగతావారి నుండి వేరు చెయ్యొచ్చు. కానీ ఆ వేరు చేయడం అనేది నిజం కావడం మీ చేతుల్లోనే ఉంది.

7. ఉద్యోగంలో రోజూ ఎదుర్కొనే సమస్యలలో ఒకటి ‘కోపం’. కోపం శక్తిని సూచించదు, అసహాయతను సూచిస్తుంది. మీరు వేసే కేకలకి తాత్కాలికంగా అవతలి వ్యక్తులు బెదిరిపోవచ్చు, కానీ చివరికి వాళ్లకి మీ మీద గౌరవం పోతుంది.

8. ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేస్తే దానిని బహిర్గతం అవ్వకుండా జాగ్రత్త పడండి. తెలివితక్కువతనం తప్పులు చేయడంలో లేదు, దాన్ని దాచి పెట్టలేకపోవడంలోనే ఉంది.

9. చివరిగా.. మీరు చేస్తున్న ఉద్యోగాలలో మంచి విజయాలను సాధించాలంటే ముందుగా మనలో కృషి, పట్టుదల, ఏకాగ్రత ఎంతో అవసరం. వాటితోపాటు సానుకూల దృక్పథం, తగిన నైపుణ్యాన్ని చూపించుకోగలిగితే అందుకోనంత ఎత్తుకు సులభంగా ఎదిగిపోవచ్చు. సమయానుకూలంగా మనల్ని మనం మార్చుకుంటూ.. మన ఆలోచనలను గమనించుకుంటూ.. కొత్త తరానికి అనుగుణంగా కొత్త విధానాలను అలవాటు చేసుకుంటూ వీలుగా మలుచుకోవాలి. అప్పుడే మనం విజయంవైపు నడవగలుగుతాము.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+