ratan-tata-telugu

Time Management in Telugu

Time Management in Telugu

ఒకసారి చెయ్యి జారిపోతే తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే అది కాలం మాత్రమే. కాలాన్ని నిరంతరం సద్వినియోగ పరుచుకోవాలి. సమయాన్ని దుర్వినియోగపరచకుండా ఎవరయితే కష్టపడతారో వాళ్ళే విజేతలుగా నిలుస్తారు.

మనలో చాలా మంది నాకు టైం సరిపోవడం లేదు, లేకపోతే అది చేసేవాడిని, ఇది చేసేవాడిని అంటూ ఉంటారు. అది సరైన వాదన కాదు. టైం అనేది అందరికీ సమానమే. పేదవాడి నుండి ప్రపంచ ధనవంతుడి వరకు అందరికీ రోజుకు 24 గంటలే. కాలం విలువ తెలుసుకుని పొదుపుగా వాడుకుంటే గొప్పవాళ్ళు అవుతారు, లేకపోతే సామాన్యులుగానే మిగిలిపోతారు.

కాలం దుర్వినియోగం అవ్వడానికి కారణాలు?

1. అతి నిద్ర

మనం రాత్రి 10 గంటలకి పడుకుని ఉదయం 7 గంటలకు లేచి ఒకటే టెన్షన్ పడిపోతూ హడావిడి చేసేస్తూ ఉంటాం.. రాత్రి ఈ పనిని చేసి ఉంటే ఇంత టెన్షన్ ఉండేది కాదు అనుకున్న సందర్భాలు కొకల్లలు.

మీరు కనుక రోజూ 12 గంటల వరకు పడుకోకూడదు 5 తరువాత మంచం మీద ఉండకూడదు అనుకుంటే రోజుకి 4 గంటలు, సంవత్సరానికి 60 రోజులు అంటే 2 నెలల సమయాన్ని సంపాదించుకున్నట్టే..

చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన మహనీయులు, గొప్పవారు అందరూ కూడా రోజులో నిద్రపోయేది ఐదు నుంచి ఆరు గంటలు మాత్రమే..

2. బద్ధకం

కాలాన్ని దుర్వినియోగ పరిచే వాటిలో మరొకటి బద్ధకం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి అంటారు. ఉదయం 5 గంటలకి లేవమని బుద్ధి చెబితే, కాసేపు పడుకో ఏమీ పరవాలేదు అని మనస్సు చెబుతుంది. మనం మనస్సు మాటే వింటాం కానీ, బుద్ది మాట వినం. అందుకే ఈ అనర్ధం.

కాబట్టి మనం మన మనస్సుని అదుపులో పెట్టుకుంటే బద్దకాన్ని జయించవచ్చు.

3. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయడం

ఏదైనా పనిని చేసేటప్పుడే శ్రద్ధ వహించి చేసినట్లయితే మళ్ళీమళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. చేసిన పనిని మళ్ళీ చేయడం అనేది సమయాన్ని వృధా చేయడం, మరియు మన ఏకాగ్రత లోపాన్ని సూచిస్తుంది.

దినచర్యని ఒక ప్రణాళికాబద్ధంగా రాసుకోవడం వల్ల సమయాన్ని పొదుపు చేయవచ్చు.

ఉదాహరణకి ఒక చోటికి వెళ్ళేటప్పుడు అక్కడ చేయవలసిన పనులన్నీ ఒక కాగితం మీద రాసుకుని వెళ్ళినట్లయితే అన్నీ ఒకేసారి పూర్తి చేసుకోవచ్చు.

4. సోషల్ మీడియాకి ఎక్కువ సమయాన్ని కేటాయించడం

ప్రస్తుత కాలంలో యువత విజ్ఞానం కన్నా వినోదానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. జియో వచ్చిన దగ్గర నుండి అయితే మరీనూ.. ఫ్రీ నెట్ తో సోషల్ మీడియా లో ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్, గేమ్స్ లతో గడపడానికి ఉపయోగించే సమయం మీ యొక్క గమ్య సాధనకు ఉపయోగిస్తే అనుకున్న టైం కంటే ముందుగానే మీరు మీ గమ్యాన్ని చేరుకోవచ్చు.

ఒక్కటి గుర్తుంచుకోండి.. సోషల్ మీడియా అంటే మీ జీవితాన్ని బయటపెట్టడం, ఎదుటివారి జీవితాల గురించి తెలుసుకోవాలని కుతూహలపడటమే.. వాటి వళ్ళ ఉపయోగం లేకపోనూ మిగిలేది సమయం వృధానే..

5. అనవసరపు మాటలు తగ్గించుకోవడం

మనలో కొంతమంది ఫోన్ లు పట్టుకుని గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటారు. తమని గుర్తించాలని తమ గురించి ఏవేవో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు లేదా తమ స్థాయిని పెంచుకోవడం కోసం అవతల వాళ్ళని చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు.

ఇలా ఒక ఆయన మరొక వ్యక్తితో సుమారు రెండు గంటల సేపు వాయించాక 'హమ్మయ్య మీతో మాట్లాడాకా నాకు తల నొప్పి పోయిందండి' అన్నాడు. దాని రెండో ఆయన 'అదెక్కడికీ పోలేదండి, నాకు చుట్టుకుంది అన్నాడు.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+