ratan-tata-telugu

How to Block Unwanted Emails in Telugu

How to Block Unwanted Emails in Telugu

మనం ఏదైనా ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ పంపించడంలో ఈమెయిల్స్ అనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అలానే బ్యాంకుకి సంబంధించిన మరియు ఏవైనా పాలసీలకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ మెయిల్స్ ద్వారా పొందుతున్నాం. అయితే ఈమెయిల్ సేవలని కంపెనీ వ్యాపారాలు వాళ్ళ యొక్క కంపెనీని ప్రమోట్ చేయడానికి సంబంధించిన సమాచారాన్ని పంపడానికి ఉపయోగిస్తున్నారు. ఈ ఇమెయిల్ సేవలని ఉపయోగించుకుని చాలా మంది హ్యాకర్లు మన యొక్క డేటాను కానీ డబ్బుని కానీ దొంగిలించడానికి వాడుకుంటున్నారు.

అయితే ఇలా ఈ రకమైన మెయిల్స్ వస్తున్నప్పుడల్లా మనం వాటిని ఎప్పటికప్పుడు 'spam' లోకి పంపిస్తుంటాం. మనం ఎన్ని సార్లు 'spam' లోకి పంపిస్తున్న ఇటువంటి మెయిల్స్ రావటం అగవు. ఇలాంటివి ఇంకా పూర్తిగా రాకుండా ఉండటానికి 3 పద్ధతులు ఉన్నాయి . అవి ఏంటో తెలుసుకుందాం..

1. మొదటి పద్ధతి: 'Block' చేయడం:

ఏదైనా కంపెనీ నుంచి లేదా ఏదైనా అప్లికేషన్ నుంచి కానీ నిరంతరంగా మెయిల్స్ వస్తున్నట్టయితే ఆ యొక్క మెయిల్స్ పంపిన వారిని పూర్తిగా 'Block' చేయవచ్చు.

a) మొదటిగా మన ఇమెయిల్ అకౌంట్ కి లాగిన్ అవ్వండి.

b) ఆ అకౌంట్ మెయిల్స్ అయితే మనం 'Block' చేద్దాం అనుకుంటామో ఆ మెయిల్ ని తెరవండి (open).

c) మెయిల్ ని తెరిచినా తరువాత నిలువుగా మూడు చుక్కలు ఉంటాయి, అందులో 'Block' ని ఎంచుకోండి.

d) అక్కడ Block అనే 'pop up' వస్తుంది, అక్కడ మరోసారి Block చేయండి.

2. ఫిల్టర్స్ (Filters) ని ఉపయోగించి ఈమెయిల్స్ ని బ్లాక్ చేయడం:

గూగుల్ మన యొక్క మెయిల్స్ కి ఫిల్టర్లను జోడించింది, ఇలా జోడించడం వల్ల మనం ఏదైనా ఇమెయిల్ ను ఫిల్టర్ చేసుకోవచ్చు.

a) మన ఇమెయిల్ అకౌంట్ లోకి లాగిన్ అయినా తరవాత సెర్చ్ బార్ లో డ్రాప్ డౌన్ బటన్ ఉంటుంది, దాన్ని ఎంచుకోండి.

b) ఇక్కడ ఎవరి మెయిల్ ని లేదా కచ్చితంగా ఏ మెయిల్ అడ్రెస్స్ కానీ బ్లాక్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని 'Sender's' లో కానీ 'TO' లో కానీ ఇచ్చి ఫిల్టర్ చేయండి.

c) దాని తరువాత అక్కడ 'Delete' అనే ఆప్షన్ ని ఎంచుకోండి, ఇలా చేస్తే మనం ఏ అడ్రెస్స్ నుంచి అయితే మెయిల్స్ రాకూడదు అని అనుకుంటున్నామో దానికి సంబంధినవి అన్ని 'Delete' అయిపోతాయి.

3. ఒక కీలకమైన (Key Word) పదాన్ని వాడుకొని ఈమెయిల్స్ ని డిలీట్ చేయడం:

a) దీని కోసం మళ్ళీ సెర్చ్ బార్ లో డ్రాప్ డౌన్ బటన్ ని ఎంచుకోండి.

b) అక్కడ 'Has the word' అనే సెక్షన్ లో ఏమైనా కీలక పదాలు అంటే ప్రమోషన్స్, సేల్స్, డిస్కౌంట్స్, ఆఫర్లు మరియు ఏదైనా ఫ్రీ గా వచ్చింది వంటి పదాలు రాయండి.

c) అలా ఒక పదాన్ని(Key Word) ఇచ్చి ఫిల్టర్ చేసిన తరవాత వచ్చిన మెయిల్స్ అన్నిటిని డిలీట్ చేయండి



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+