ratan-tata-telugu

Credit Card అంటే ఏమిటి? How to Get Credit Card in Telugu

What is Credit Card:

ఈ రోజుల్లో Online Shopping సైట్ లు Debit Card ల కన్నా Credit Cardల మీద ఎక్కువ ఆఫర్ లను ప్రకటిస్తూ ఉన్నాయి. అందువలన క్రెడిట్ కార్డ్స్ ని ఉపయోగించేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అయినప్పటికీ ఇంకా కొంత మందికి క్రెడిట్ కార్డు గురించి సరైన అవగాహన లేదు. దానికి కారణం Credit Card ఉంటే అనవసరమైన ఖర్చులు చేస్తారని, కాబట్టి క్రెడిట్ కార్డుని ఉపయోగించవద్దని చాల మంది చెప్తుంటారు. అది కొంతవరకు నిజమే అయినప్పటికి క్రెడిట్ కార్డు గురించి పూర్తిగా తెలుసుకుని, ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే క్రెడిట్ కార్డు వలన కొన్ని ఉపయోగాలు కూడా లేకపోలేదు. అందుకే ఇప్పుడు మనం క్రెడిట్ కార్డు అంటే ఏమిటి? క్రెడిట్ కార్డు ని సక్రమంగా ఎలా వాడుకోవాలో వివరంగా తెలుసుకుందాం

Credit Card అనేది సాధారణంగా మనం ఉపయోగించే ATM లేదా డెబిట్ కార్డు లాగానే ఉంటుంది. బ్యాంకు లు గాని, ఫైనాన్సియల్ సర్వీసెస్ కి చెందిన కంపెనీ లు కానీ మనం వాడుకోవడానికి కొంత డబ్బుని అప్పుగా ఇస్తాయి. ఆ అప్పుగా ఇచ్చిన డబ్బుని కొన్ని రోజుల పాటు (సాధారణంగా 21 నుండి 30 రోజుల వరకు, ఇది బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది) ఎటువంటి వడ్డీ లేకుండానే వాడుకోవచ్చు. ఆ గడువు లో కనుక ఆ అప్పుని తిరిగి చెల్లించకపోతే అప్పుడు వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. అదే ఆ పీరియడ్ లోపు చెల్లిస్తే ఎటువంటి వడ్డీ కట్టనవసం లేదు. లేదా మనం వాడుకున్న డబ్బుని ప్రతి నెల కొంత చొప్పున EMI ల రూపంలో చెల్లించవలసి ఉంటుంది. అందుకుగాను కొంత వడ్డీని చెల్లించాలి. అలాగే ప్రతి క్రెడిట్‌కార్డుకు కొంత అమౌంట్ వరకు లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకు మనం ఆ కార్డును ఉపయోగించుకోవచ్చు.

కాబట్టి డెబిట్ కార్డు అంటే అప్పటికే మన బ్యాంకు లో ఉన్న మన డబ్బుని ఉపయోగిచుకోవాటానికి సహాయపడే కార్డు. కానీ క్రెడిట్ కార్డు అనేది బ్యాంకు వాళ్ళు మనకి అప్పుగా ఇచ్చిన డబ్బుని ఉపయోగిచుకునే కార్డు. ఈ క్రెడిట్ కార్డుని అవసరానికి వాడుకోవాలి కానీ ఉంది కదా అని అవసరం లేకపోయినా వాడకూడదు. కాని క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడుకుంటే చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుందాం.

మీరు Free గా క్రెడిట్ కార్డు ని పొందాలనుకుంటున్నారా?

Click Here >> Get Life Time Free ICICI Credit Card (No Joining Fee & No Annual Fee)

Advantages of Credit Cards (క్రెడిట్ కార్డు వలన లాభాలు):-

1. క్రెడిట్ కార్డు ని ఉపయోగించుకుని, ఇచ్చిన టైం లో సక్రమంగా డబ్బులు చెల్లిస్తూ ఉంటె మన Credit Score or Cibil Score పెరుగుతుంది. ఎవరికైతే ఈ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి భవిష్యత్తులో ఏదైనా లోన్ కావలసినప్పుడు బ్యాంకు లు ఈ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్నవాళ్ళకి త్వరగా లోన్స్ ఇస్తాయి.

(Credit Score అంటే ఏమిటి?)

2. క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చిన టైం పీరియడ్ వరకు డబ్బుకి ఎటువంటి వడ్డీ లేకుండా ఉచితంగా వాడుకోవచ్చు.

3. క్రెడిట్ కార్డు ని ఉపయోగించి పేమెంట్ చేసినప్పుడు Reward Points, Cashback లు పొందవచ్చు

4. అత్యవసర సమయంలో డబ్బు లేనప్పుడు క్రెడిట్ కార్డు ఉంటె మనకు చాలా హెల్ప్ అవుతుంది.

5. ఒకేసారి ఎక్కువ డబ్బుని చెల్లించలేనపుడు EMI పద్దతిలో నెల నెల కట్టుకునే సదుపాయం ఉంటుంది.

6. క్రెడిట్ కార్డులపై ఇ-కామర్స్ సైట్లు కూడా బోలెడు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఒక్కొక్కసారి డెబిట్ కార్డు కన్నా కూడా క్రెడిట్ కార్డు మీద ఎక్కువగా ఆఫర్లుంటాయి.

7. కొన్నిసార్లు వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా "No Cost EMI" ఆఫర్లు ఉంటాయి. వాటినీ ఉపయోగించుకోవచ్చు. అంటే ఎంటువంటి వడ్డీ లేకుండా నెల నెల వాయిదాల రూపంలో కట్టుకోవచ్చు.

అయితే క్రెడిట్ కార్డు ని మంచిగా ఉపయోగించుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా సరిగ్గా ఉపయోగించకపోతే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

మీరు Free గా క్రెడిట్ కార్డు ని పొందాలనుకుంటున్నారా?

Click Here >> Get Life Time Free ICICI Credit Card (No Joining Fee & No Annual Fee)

Disadvantages of using a Credit Card (క్రెడిట్ కార్డు వలన నష్టాలు):-

1. క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న అప్పుని ఇచ్చిన టైం లో కనుక చెల్లించకపోతే చాలా ఎక్కువ వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. దీనివలన క్రెడిట్ స్కోర్ కూడా తగ్గిపోతుంది.

2. క్రెడిట్ కార్డు ని ఉపయోగించినప్పుడు Late payment fees, Joining fees, Renewal fees మరియు Processing fees ఉంటాయి. అయితే కొన్ని బ్యాంకు లు ఇటువంటి ఫీజు లు ఏమి లేకుండా కూడా క్రెడిట్ కార్డు ని అందిస్తున్నాయి.

క్రెడిట్ కార్డు ని తీసుకునే ముందు, అలాగే తీసుకునే తరువాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

1. కొంత మంది ఒక వస్తువు అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డు లో అమౌంట్ ఉంది కదా అని దుబారా గా ఖర్చు చేస్తుంటారు. అలా చేయకండి.

2. సాధ్యమైనంత వరకు Joining Fee మరియు Annual Maintenance ఛార్జ్ లేని కార్డు లు పొందడానికి ప్రయతించండి.

3. మీ అవసరానికి సరిపడే క్రెడిట్ కార్డు ని ఎంచుకోండి. ఉదాహరణకి మీరు ఆన్లైన్ లో ఎక్కువగా షాపింగ్ చేస్తే ఒక రకమైన కార్డు, ప్రయాణాలు ఎక్కువ చేస్తే మరొక రకమైన కార్డు లు ఉంటాయి. వీటి వలన మీరు ఎక్కవుగా బెనిఫిట్స్ పొందవచ్చు. ఉదాహారానికి మీరు ఆన్లైన్ లో షాపింగ్ ఎక్కువ చేస్తే Amazon Pay ICICI Bank Credit Card ఎక్కువగా ఉపయోగపడవచ్చు. దీని వలన ఆన్లైన్ షాపింగ్ చేసిన ప్రతిసారి మీకు కాష్ బ్యాక్ లభిస్తుంది.

4. ప్రతినెలా క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ స్టేట్‌మెంట్‌లోని లావాదేవీలన్నీ మనం చేసినవేనా కాదా చూసుకోవాలి. ఒక్కొక్కసారి మోసాలు కూడా జరిగే అవకాశం ఉంది.

కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ సరైన విధంగా క్రెడిట్ కార్డు ని ఉపయోగించుకోవచ్చు.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+