ratan-tata-telugu

Anand Mahindra Biography in Telugu - ఆనంద్ మహీంద్రా జీవిత చరిత్ర

మహీంద్రా ... ఈ పేరు వినగానే పల్లెటూరి పొలాల్లో పనిచేసే పవర్ఫుల్ ట్రాక్టర్లు, బయట రోడ్లపై సాలిడ్ గా తిరిగే SUV లు గుర్తొస్తాయి. వాటికి అంత గుర్తింపు రావడం వెనుక ఒక వ్యక్తి కృషి ఉంది. ఆయనే ఆనంద్ మహీంద్రా.ఈ పేరు ఎప్పుడూ వార్తలలో వినబడుతూనే ఉంటుంది.


ఒక పేద పిల్లవాడికో, ఒక ముసలవ్వకో కావాల్సిన సహాయం అందిస్తారు. ఒక క్రీడాకారుడు బాగా ఆడినా, ఒక వస్తువును కొత్తగా డిజైన్ చేసినా, కొత్తగా ఆలోచించిన ఏ మాత్రం గర్వం లేకుండా ప్రతి ఒక్కరిని మెచ్చుకుంటారు.వాళ్ళకి ఏమైనా అవసరం ఉంది అని తెలిస్తే చాలు వెంటనే వాళ్ళకి సహాయం చేస్తారు. ఎంతో మంది ప్రతిభ ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెలుగులోకి తీసుకువస్తారు.


మూవీ స్టార్స్ కి, స్పోర్ట్స్ మెన్స్ కి ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. కానీ బిజినెస్ మ్యాన్ లకి ఫాన్స్ ఉండడం చాలా అరుదు అలాంటి గౌరవం రతన్ టాటా గారికి ఆ తరువాత ఈయనకే దక్కింది. మన దేశంలో రతన్ టాటా గారి తరువాత ఎక్కవ మంది ఇష్టపడే బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా అని చెప్పవచ్చు. ప్రజలు అంతలా ఆయనను ఇష్టపడపడానికి ఆయన ఏం చేసారు? మనం ప్రతిరోజూ చూసే మహీంద్రా గ్రూప్ చరిత్ర ఏమిటి? అసలు ఈ ఆనంద్ మహీంద్రా ఎవరు మహీంద్రా గ్రూప్ ని విజయవంతంగా గా ఎలా నడిపించారు? ఇలా ఆనంద్ మహీంద్రా సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం.


1945 అక్టోబర్ 2 వ తేదీన జగదీష్ చంద్ర మహీంద్రా, మరియు కైలాష్ చంద్ర మహీంద్రా అనే ఇద్దరు అన్నదమ్ములు తమ స్నేహితుడు అయిన మాలిక్ గులాం మహమ్మద్ అనే ఫ్రెండ్ తో కలిసి Mahindra & Muhammad అనే పేరుతో కంపెనీ ని స్థాపించారు. మొదట ఇది స్టీల్ ట్రేడింగ్ కంపెనీ. అయితే 1947 లో ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత ఇండియా పాకిస్తాన్ విడిపోవడంతో ఈ పార్టనర్స్ లో ఒకరైన గులాం మహమ్మద్ కు కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ దేశానికి మొదటి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యే అవకాశం రావడంతో ఈయన ఈ కంపెనీ లో తన వాటా ని అమ్మేసి పాకిస్తాన్ కి వెళ్లిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తరువాత Mahindra & Muhammad ఉండే ఆ కంపెనీ పేరును Mahindra & Mahindra గా మార్చారు.


ఒకసారి ఈ సోదరులు ఇద్దరు విదేశాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జీప్ లను చూసి ఇలాంటివి ఇండియా లో రోడ్ల మీద తిరగడానికి బాగా సరిపోతాయి అని గుర్తించి Willys Jeeps ని ఇండియా లో తయారు చేయడానికి లైసెన్స్ తీసుకుని 1949 లో జీప్ ల తయారీ మొదలు పెట్టారు. ఆ సమయంలో ఆ జీప్ లు చాలా బాగా సక్సెస్ అయ్యాయి. ఇంతకు ముందు మనం చుస్తే పోలీస్ లు ఉపయోగించే జీప్ లన్నీ మహీంద్రా జీప్ లే ఉండేవి.


ఇదిలా ఉంటే 1955 May 1 వ తేదీన Harish Mahindra మరియు Indira Mahindra అనే దంపతులకు ఆనంద్ మహీంద్రా జన్మించారు. కంపెనీ ఫౌండర్స్ లో ఒకరైన జగదీష్ చంద్ర మహీంద్రా మనువడు ఈయన. ఈయన చిన్నప్పటి చదువు అంతా తమిళనాడులోని Lawrence School లో జరిగింది. ఈయనకు చిన్నప్పటి నుండి సినిమాల మీద ఆసక్తి ఉండేది. దాంతో ఈయన Harvard Universityలో film making and architecture లో స్టడీ పూర్తి చేసారు. కానీ తరువాత బిజినెస్ మీద ఆసక్తి రావడంతో Harvard Business School లో ఎంబీఏ కంప్లీట్ చేసారు. ఈయన హార్వార్డ్ లో చదువుతున్న సమయంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయిన బిల్ గేట్స్ ఈయన క్లాస్ మేట్.


1961 లో మహీంద్రా కంపెనీ అమెరికా కంపెనీ తో collaborate అయ్యి ట్రాక్టర్స్, agriculture machinery, construction equipment, trucks తయారీ రంగంలోకి ఎంటర్ అయ్యింది. అలా మొదలైన మహీంద్రా ట్రాక్టర్స్ రైతులకి ఇష్టమైన బ్రాండ్ గా మారిపోయింది. ఇక ట్రాక్టర్ అంటే మహీంద్రా నే గుర్తుకు వచ్చేలా కంపెనీ ఎదిగింది.


ఇప్పుడు ఇండియా లోనే కాదు ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడయ్యే ట్రాక్టర్ లు మహీంద్రా కంపెనీవే.


మరొక వైపు ఆనంద్ మహీంద్రా చదువు పూర్తైన తరువాత వాళ్ళ కి చెందిన Mahindra Ugine Steel Company లో Executive Assistant గా ఒక ఉద్యోగిగానే జాయిన్ అయ్యారు. తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ 1997 నాటికి మహీంద్రా గ్రూప్ కి Managing Director గా 2012 లో చెర్మైన్ స్థాయికి చేరారు.


అయితే ఈ కంపెనీ లో చేరిన మొదటి నుండే ఆనంద్ మహీంద్రా కి ఎన్నో ఓడిదుడుకులు ఎదురయ్యాయి. 1996 లో మహీంద్రా కంపెనీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ఎంటర్ అవ్వాలని డిసైడ్ అయ్యిది. కానీ అప్పటికి వాళ్ళ దగ్గర సరైన టెక్నాలజీ లేకపోవడంతో ప్రముఖ కార్ కంపెనీ అయినా ఫోర్డ్ కంపెనీ తో టై అప్ అయి Escort car ని రిలీజ్ చేసారు. మహీంద్రా గ్రూప్ నుండి వచ్చిన ఫస్ట్ కార్ అది. కానీ ఆ మోడల్ మార్కెట్ లో ఫెయిల్ అయ్యింది. అయినా ఆనంద్ మహీంద్రా నమ్మకం కోల్పోలేదు.


ఈసారి ఎవరితోనూ partnership లేకుండా సొంతంగా కార్ ల తయారీకి దిగారు. ఇంటర్నేషనల్ కంపెనీ సహాయం తీసుకుంటేనే కార్ మోడల్ ఫెయిల్ అయ్యింది. అలాంటిది సొంతంగా కార్ ని రీలీజ్ చేస్తే డిసాస్టర్ అవుతుందని, అందరు ఇది ఒక స్టుపిడ్ ఐడియా అన్నారు. కానీ మహీంద్రా గారు అవేమి పట్టించుకోకుండా 2000 వ సంవత్సరంలో Powerful engine తో ఇండియా లోని రోడ్ లకి సరిపడేలా డిజైన్ చేసి బొలెరో అనే SUV మోడల్ కార్ ని రిలీజ్ చేసారు. ఆ మోడల్ ఇండియా లో సూపర్ హిట్ అయ్యింది. ఎంతలా అంటే వరసగా 10 సంవత్సరాలు బొలెరో India's highest-selling SUV గా నిలిచింది.


బొలెరో సూపర్ హిట్ అయితే అయ్యింది గాని అప్పటికే Maruti 800 and Hyundai Santro కార్లు మార్కెట్ ని ఏలుతున్నాయి. ఫ్యామిలీ కి సరిపడేలా చిన్నగా ఉండడం, తక్కువ ధర లో అందుబాటులో రావడంతో మార్కెట్ షేర్ మొత్తం మారుతి కంపెనీ చేతిలోనే ఉండేది. అంతేకాదు 2000 ... 2001 సంవత్సర కాలంలో మహీంద్రా కంపెనీ షేర్ లు విపరీతంగా పడిపోయి, కంపెనీ నష్టాల్లోకి వెళ్లడం స్టార్ట్ అయ్యింది.


ఆ సమయంలో ఆనంద్ మహీంద్రా ధైర్యం చేసి 2002 లో మహీంద్రా గ్రూప్ నుండి మరొక ఆయుధాన్ని వదిలారు. దాని పేరే మహీంద్రా స్కార్పియో. కార్ మార్కెట్ లో స్కార్పియో దుమ్ము లేపేసింది. ఈ ఒక్క మోడల్ మళ్ళీ మహీంద్రా గ్రూప్ ని తిరిగి నిలబడేలా చేసింది. కేవలం ఇండియా లోనే కాదు European African asian అన్ని కంట్రీస్ లో స్కార్పియో డిమాండ్ పెరిగిపోయింది. మహీంద్రా స్కార్పియో లాంచ్ అయిన తరువాత కంపెనీ దశ తిరిగిపోయింది. ఇప్పటికి ఎంతో మందికి స్కార్పియో డ్రీం కార్.


ఆ తరువాత మహీంద్రా కార్ ల విభాగంలో థార్, XUV500 వంటి మోడల్స్ మంచి సక్సెస్ అయ్యాయి. అంతేకాదు మహీంద్రా xuv 300 మోడల్ అయితే 5 స్టార్ రేటింగ్ తో ఇండియా లోనే safest కార్ లలో ఒకటిగా నిలిచింది.


మరొక వైపు మహీంద్రా గ్రూప్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక్కొక్క రంగంలోకి విస్తరిస్తూ ఎన్నో కంపెనీ లను తనలో కలుపుకుంది. 1999 లో గుజరాత్ ట్రాక్టర్స్ కంపెనీ కొని మహీంద్రా లో కలిపారు. అలాగే మళ్ళీ 8 ఇయర్స్ తరువాత Punjab Tractors Limited ని కొని దానిని Swaraj ట్రాక్టర్లు గా మార్చారు. ఈ కొనుగోలుతో మహీంద్రా ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాక్టర్ ల కంపెనీ గా మారింది.


అంతేకాదు 2009 లో బయట పడ్డ సత్యం కంప్యూటర్ స్కాం తరువాత ఆ సత్యం కంప్యూటర్స్ ని ధైర్యంగా కొనుగోలు చేసి టెక్ మహీంద్రా లోకి విలీనం చేసి ఎన్నో కేసులు, అప్పులల్లో కూరుకుపోయిన కంపెనీ ని లాభాలల్లోకి తెచ్చారు .


అలాగే 2010 లో REVA Electric Car Company, 2011 లో SsangYong Motor కంపెనీ లను కొనుగోలు చేసారు. ఇలా ఇప్పటివరకు మహీంద్రా గ్రూప్ 27 కంపెనీ లను కొనుగోలు చేసింది. 9 కంపెనీ లలో ఇన్వెస్ట్ చేసింది.


1985 లో ఒకసారి కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేసిన ఉదయ్ కోటక్ అనే వ్యక్తి ఆనంద్ మహీంద్రా ని కలిశారు. అప్పుడు ఆనంద్ మహీంద్రా ఉదయ్ కోటక్ తెలివిని చూసి కొత్తగా స్టార్ట్ చేసిన ఆ కంపెనీ లో లక్ష రూపాయల ఇన్వెస్ట్ చేసి అతనికి సపోర్ట్ చేసారు. ఇప్పుడు ఆ కంపెనీ ఏ ఇండియా లోనే వన్ అఫ్ ది లార్జెస్ట్ బ్యాంకు అయిన కోటక్ మహీంద్రా బ్యాంకు గా ఎదిగింది. ఆయన చేసిన సపోర్ట్ కి గాను పేరులో మహీంద్రా అని చేర్చారు. ఇప్పుడు ఆ బ్యాంకు అంత అభివృద్ధి చెందడానికి ఆనంద్ మహీంద్రా ఎంతో సపోర్ట్ చేసారని ఉదయ్ కోటక్ చెప్తారు.


ఇలా కేవలం స్టీల్, కార్, ట్రాక్టర్లు లోనే కాకుండా aerospace, agribusiness, aftermarket, construction equipment, defence, energy,finance insurance, IT, hospitality, logistics, real estate ఇలా 22 రంగాలలో 100 కి పైగా దేశాలలోఈ కంపెనీ విస్తరించింది. దీనంతటి కి కారణం ఆ గ్రూప్ ని నడిపిస్తున్న ఆనంద్ మహీంద్రా మరియు ఆయన కృషి.


ఇదంతా ఆనంద్ మహీంద్రా గారిలో ఒక వైపు. ఈయన కేవలం బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు. సోషల్ మీడియా స్టార్ కూడా. ఈయనకు ట్విట్టర్ లో 92 లక్షల మంది ఫాలోవర్ లు ఉన్నారు. ఈ ట్విట్టర్ ద్వారానే ఆయన ప్రజలతో మమేకం అవుతారు. వ్యాపారంలో డబ్బులు సంపాదించడానికి, లాభాలు పెంచుకోవడానికి ఆలోచించే బిజినెస్ మ్యాన్ లు ఉన్న ఈ రోజుల్లో అంత బిజీ సమయంలో కూడా ఎవరిలో అయిన ప్రతిభ ఉంటే అభినందిస్తారు, అందరికి తెలియచేస్తారు. ఎవరికైనా వెంటనే సహాయం అవసరం అయితే మానవత్వంతో సహాయం చేస్తారు. చాలా మందికి పక్కవారిని మెచ్చుకోవాలంటే వాళ్ళ ఇగో అడ్డు వస్తుంది. మెచ్చుకోలేరు. కానీ అంత పెద్ద స్థాయిలోఉండి కూడా, కోట్ల ఆస్తి ఉన్నా సరే ఎటువంటి గర్వం లేకుండా అందరినీ మెచ్చుకుంటారు.


అలా సోషల్ మీడియా ద్వారా ఆయన చేసిన కొన్ని మంచి పనులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం . మైసూర్ కి చెందిన Dakshina murthy అనే వ్యక్తి అమ్మగారు చిన్నప్పటి నుండి వాళ్ళ ఊరు దాటి బయటకు వెళ్ళలేదు. దాంతో వాళ్ళ అమ్మగారికి భారతదేశం మొత్తాన్ని తిప్పి చూపించాలి అని నిర్ణయించుకుని, ఆయన బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి తన స్కూటర్ మీద వాళ్ళ అమ్మగారిని ఎక్కించుకుని 48100 కిలోమీటర్లు తిరుగుతూ వాళ్ళ అమ్మగారికి ఇండియా మొత్తం చూపిస్తున్నారు. ఈ విషయం ఆనంద్ మహీంద్రా గారికి తెలిసి బైక్ మీద జర్నీ ఇబ్బందిగా ఉంటుందని ఇకపై కార్ మీద వాళ్ళ అమ్మగారిని తిప్పమని Dakshina murthy గారికి Mahindra KUV కార్ ని ఆఫర్ చేసారు.


అలాగే మధ్య ప్రదేశ్ లో Shobharam అనే ఒక తండ్రి తన పిల్లవాడిని 10 వ తరగతి పరీక్షలు రాయించడానికి 105 కిలోమాటర్లు సైకిల్ తొక్కుకుంటూ Exam Center కి తీసుకువెళ్తున్నాడనికి తెలిసి ఇకపై ఆ పిల్లవాడి చదువుకి కావలసిన ఖర్చు అంతా తాను భరిస్తానని ప్రామిస్ చేసారు.


తమిళనాడు కి చెందిన కమలతల్ అనే ఒక ముసలావిడ గత 30 సంవత్సరాల నుండి ఇడ్లీ లను తక్కువ రేట్ కి అమ్ముతుంది. ఇప్పటికి కూడా ఆమె పేదల కోసం అని కేవలం ఒక్క రూపాయికే ఇడ్లీ & సాంబార్ ని అందిస్తుంది. అందుకే ఈమెను ఇడ్లీ అమ్మ అని పిలుస్తారు. ఈమె స్టోరీ సోషల్ మీడియా లో వైరల్ అయ్యి మహీంద్రా గారికి తెలిసింది. ఇప్పటికీ ఆమె కట్టెల పొయ్యే వాడడం చూసి ఆమెకు గ్యాస్ స్టవ్ కొంటానని,ఎవరైనా ఆమె గురించి తెలిస్తే చెప్పమన్నారు. అలా కేవలం ఒక్కరోజులోనే ఆమె ఇంటికి గ్యాస్ స్టవ్ సిలిండర్ చేరుకున్నాయి. అంతేకాదు ఆమె ఇల్లు చిన్నగా ఉండి ఇబ్బంది పడుతుంది అని తెలిసి మదర్స్ డే రోజున ఆమెకు ఒక ఇల్లు ని కూడా కట్టించి ఇచ్చారు.


అలాగే ఆటో డ్రైవర్ తన ఆటో వెనకభాగాన్ని స్కార్పియో కార్ వెనుక భాగంతో మార్చి నడుపుతున్న దృశ్యం ఈయనకు కనిపించింది. దానితో ఆయన ఆ ఆటో ని తన మ్యూజియం లో ఉంచుకోవడానికి ఆ ఆటో ని కొనుక్కుని అతనికి కొత్త Mahindra Supro ఫోర్ వీలర్ ఆటో ట్రక్ ని బహుమతిగా ఇచ్చారు.


ఢిల్లీ లో కాళ్ళు చేతులు సరిగా లేని ఒక వికలాంగుడు తాను ఆపరేట్ చేసుకోవడానికి వీలుగా బైక్ ఇంజిన్ తో ఒక ఆటో ని తయారు చేసుకుని ఆ ఆటో నడుపుతూనే జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ విషయం మహీంద్రా గారికి తెలిసి Mahindra Logistics కంపెనీ లో జాబ్ ని ఇప్పించారు.


శిల్ప అనే ఆవిడ ఆర్థిక ఇబ్బందులు కారణంగా చిన్నగా ఏదైనా స్టార్ట్ చేయడానికి బ్యాంకు కి వెళ్ళి లోన్ అడిగితే బ్యాంకు వాళ్ళు ఇవ్వకపోవడంతో తన పిల్లల చదువు కోసం దాచిన డబ్బుతో ఒక బొలెరో ట్రక్ ని కొనుక్కుని ఒక ఫుడ్ ట్రక్ ని స్టార్ట్ చేసింది అనే విషయం తెలిసి ఆమె సాహసానికి మెచ్చుకుని ఆమె ఒక entrepreuer కాబట్టి ఆమెకు కావలసింది విరాళం కాదు ఇన్వెస్ట్మెంట్ కాబట్టి తన బిజినెస్ ని విస్తరింప చేయడానికి సెకండ్ ఔట్లెట్ కోసం కావాల్సిన కొత్త బొలెరో ని ఆమెకు అందించారు.


Abid Khan అనే national level boxing champion పేదరికం కారణంగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటే boxing academy ని స్టార్ట్ చేయడానికి కావలసిన సపోర్ట్ ని అందించడానికి ముందుకు వచ్చారు.


ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి కొంచెం క్రియేటివ్ గా అలోచించి షూ హాస్పిటల్ అని బ్యానర్ పెట్టుకుంటే ఆ ఐడియా కి మెచ్చుకుని ఆయన తన టీం ని పంపి అతనికి కావాల్సిన హెల్ప్ ని అందించారు.


ఇలా చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఏ బిజినెస్ మ్యాన్ ఇలా ప్రజలలో ఉండి చిన్న చిన్న వాళ్ళని ప్రోత్సహిస్తూ, అందరికీ సహాయం చేస్తూ ఉంటారో చెప్పండి. అందుకే ఎక్కువ మంది అభిమానించే వ్యాపారవేత్తలలో ఈయన ఒకరిగా నిలిచారు.


ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ట్విట్టర్ వేదికగా చేసుకుని చేసే మంచి పనులు ఇవే కాకుండా ఈయన Nanhi Kali అనే సంస్థ ని స్థాపించి దీని ద్వారా పేద ఆడ పిల్లలకి చదువుని అందిస్తున్నారు. అలా ఇప్పటివరకు 4,50,000 బాలికలు సహాయం పొందారు.


ఇలా చెప్పుకుంటూ పోతే మహీంద్రా గారి ఔదార్యానికి అవధులు లేవు.


ఇదిలా ఉంటే ఆనంద్ మహీంద్రా గారు వ్యాపార రంగంలో చేసిన కృషికి ,సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు తో సత్కరించింది.


అంతేకాదు ఫోర్బ్స్ మ్యాగజిన్ 2013 లో Entrepreneur of the Year గా, Fortune Magazine ... World's 50 Greatest Leaders లో ఒకరిగా గుర్తించాయి. వీటితో పాటు ఈయనకు చాలా అవార్డ్స్ వచ్చాయి.


ఒకవైపు అంత పెద్ద కంపెనీ ని నడిపిస్తూ కూడా మరొక వైపు ఎటువంటి అహంకారం లేకుండా అందరినీ ప్రోత్సహిస్తూ, సహాయం చేస్తున్న ఆనంద్ మహీంద్రా గారి జీవితం మన అందరికీ ఆదర్శం.

ads
+