ratan-tata-telugu

How Medicine Works in the Human Body in Telugu

How medicine works in the human body

మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు మాత్రలు వేసుకోవడం అనేది సహజం.. మాత్రలు వేసుకున్న కొద్దిసేపటిక ఏదైనా నొప్పి కానీ, వ్యాధి కానీ నయం అవ్వడం, మనకి ఉపశమనం కలగడం అనేది మన అందరికీ కలిగే అనుభవమే.. అయితే అసలు మనం వేడుకున్న మందులు శరీరంలోకి వెళ్ళాక ఎలా పని చేస్తాయి? మనం వేసుకున్న మందుకి నేరుగా పలానా ప్రదేశానికే వెళ్ళాలి అని ఎలా తెలుస్తుంది? మనం మందు వేసుకున్న కొద్ది సేపటికే ఉపశమనం ఎలా కలుగుతోంది? ఇలాంటి ఆసక్తికరమయిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మనం మాత్రను వేసుకున్నప్పుడు, అది కడుపులోని చిన్న ప్రేగు ద్వారా కాలేయంలోకి ప్రయాణిస్తుంది, అక్కడ మనం మింగిన మాత్ర అనేది అతి చిన్న చిన్న భాగాలుగా విచ్ఛిన్నమై దాని యొక్క అవశేషాలు రక్తంతో కలిసి శరీరంలోని అన్ని అవయవాలు మరియు కణజాలాలకు ప్రయాణించడం మొదలుపెడతాయి.

అయితే, రక్తంలో కలిసిన డ్రగ్ కి నొప్పి శరీరంలోని పలానా భాగంలో ఉంది, నేరుగా ఆ ప్రదేశానికే వెళ్ళాలి అని ఏమీ తెలియదు. అదృష్టవశాత్తూ, మన శరీరానికి ఒక వ్యవస్థ ఉంది. అదేమిటంటే రక్తంతో కలిసి వచ్చిన డ్రగ్ ని, వ్యాధి ఉన్న ప్రదేశం ఆటోమేటిక్ గా స్వీకరించడం మొదలుపెడుతుంది. రక్తంతో కలిసి ఉన్న డ్రగ్ కూడా నొప్పి లేదా వ్యాధి ఉన్న ప్రదేశం చేరుకున్న తరువాతనే రియాక్ట్ అవ్వడం మొదలవుతుంది. ఆ ప్రదేశం దొరకనంత వరకు కూడా రక్తంతో పాటుగా శరీరం మొత్తం తిరుగుతుంటుంది తప్ప రియాక్ట్ అవ్వడం మాత్రం జరగదు.

ఈ ప్రక్రియ మీకు సులభంగా అర్దమవ్వడానికి దీనినంతటినీ ఒక తాళం మరియు కీ తో పోల్చండి. ఇక్కడ డ్రగ్ అనేది కీ లాగ ఊహించుకోండి. కీ అనేది తాళం(నొప్పి) కొరకు శరీరం మొత్తం తిరుగుతుంటుంది.తాళం(నొప్పి) దొరికినప్పు మాత్రమే లాక్ అవ్వడమనేది జరుగుతుంది. ఈ విధంగా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టిన కొద్ది సమయానికే మనకి ఉపశమనం కలుగుతుంది.

ఇది అంతా బాగానే ఉంది, నొప్పి లేదా వ్యాధి ఉన్న ప్రదేశం చేరుకునేంతవరకు డ్రగ్ అనేది రియాక్ట్ అవ్వకపోవడం నిజమయితే మరి సైడ్ ఎఫెక్ట్స్ సంగతేమిటని మీకు సందేహం రావొచ్చు..

ఒక్కొక్కసారి డ్రగ్స్ కూడా లక్ష్య ప్రదేశంతో కాకుండా ఇతర ప్రదేశాలతో రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది.

సాధారణంగా ఇలాంటి సందర్భాలను కీమోథెరపీ తీసుకుంటున్న కాన్సర్ బాధితులలో మీరు గమనించవచ్చు. డ్రగ్ అనేది వ్యాధి కన్నా ముందు శరీరంలోని వేగంగా పెరిగే మరియు వేగంగా విభజించే కణాల కోసం వెతుకుతాయి. అందుకే వ్యాధి ఉన్న ప్రదేశం కన్నా ముందు జుట్టు కణాలతో రియాక్ట్ అవ్వడం మొదలుపెడతాయి. కీమోథెరపీ బాధితులకు జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి కారణం ఇదే..

ఒకే ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ ద్వారా ఈరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ ఆర్టికల్ కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని మీ స్నేహితులందరితో షేర్ చేసుకోండి.దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మరిచిపోకండి.





You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+