ratan-tata-telugu

How to Increase Height in Telugu - How to Grow Taller

How to Increase Height (హైట్ పెరగడం ఎలా?)

Height (ఎత్తు) పెరగడం అనేది ముఖ్యంగా మన జీన్స్ పై అంటే జన్యువులపై ఆధారపడి ఉంటుంది. సుమారుగా 60 నుండి 80 శాతం మనుషుల యొక్క ఎత్తు జీన్స్ ని బట్టే ఉంటుంది. అయితే 20 నుండి 40 శాతం ఎత్తు మనం తీసుకునే పోషకాహారం పై ఆధారపడి ఉంటుంది.

మీరు శరీరానికి కావలసిన పోషక ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవడం వల్ల అవి మీరు ఎత్తు ఎదగడానికి సహాయపడవచ్చు. ఒక్కసారి మీ గ్రోత్ ప్లేట్స్ కలిసిపోయినట్లయితే ఇంక మీరు ఎత్తు ఎదగడం ఆగిపోతారు. ఇది సాధారణంగా 14 మరియు 18 సంవత్సరాల మధ్య జరుగుతుంది. ఒకవేళ మీరు ఆ తర్వాత కూడా పెరుగుతున్నట్లు అయితే మీరు పాటించిన ఆహారపోషణ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి మీకు సహాయపడి ఉండవచ్చు.

ఎత్తు పెరగడం కోసం పాటించవలిసిన కొన్ని చిట్కాలు.

1. మీ శరీరం ఎదగడానికి ఆరోగ్యకరమైన మరియు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం మంచి పోషకాహారం మీ శరీరం యొక్క ఎదుగుదల సామర్ధ్యాన్ని నిర్ణయిస్తుంది. మీరు రోజూ తినే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, లీన్ ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోండి. మీ ప్లేట్ లో సగభాగం తాజా కూరగాయలు, పావు వంతు లీన్ ప్రోటీన్లు మరియు మరో పావు వంతు కార్బోహైడ్రేట్లు ఉండాలి.

ప్రొటీన్ల ఉన్న ఆహార పదార్థాలకు ఉదాహరణలు: మాంసం, చేపలు, బీన్స్ మరియు తక్కువ కొవ్వు శాతం ఉన్న పాలు.

కార్బో హైడ్రేట్ ఉన్న పదార్థాలకు ఉదాహరణకు: తృణధాన్యాలు మరియు పిండి పదార్థం ఎక్కువగా కలిగి ఉన్న కూరగాయలు - బంగాళాదుంపలు.

2. మీ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్లు ఉండేలా చూసుకోండి. కండరాలు మరియు శరీర బరువును పెంచడానికి ఈ ప్రోటీన్లు మీకు సహాయపడతాయి. ఉదాహరణకి పెరుగు, చేపలు, చికెన్ మరియు వెన్న తినడం మంచిది.

3. మీకు గుడ్డు అంటే ఎలర్జీ లేకపోతే ప్రతి రోజూ ఒక గుడ్డు తినండి. ప్రతిరోజు ఒక గుడ్డు తినే పిల్లలు తినని పిల్లలకంటే ఎక్కువ ఎత్తు పెరుగుతారు. గుడ్లు పెరుగుదలకు తోడ్పడే ప్రొటీన్లు మరియు విటమిన్లు కలిగి ఉంటాయి.

4. ప్రతిరోజు పాల పదార్థాలు తినడం మంచిది. మీ శరీరానికి తగిన పోషణ ఇవ్వడానికి పాలలో ప్రొటీన్లు, కాల్షియం మరియు విటమిన్లు ఉంటాయి. అలాగే క్యాల్షియం మరియు విటమిన్లు కలిగి ఉండే ఇతర ఆహార పదార్థాలు తినడం మంచిది.

5. బలమైన ఎముకలు మరియు కండరాల కోసం రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎత్తు కూడా పెరుగుతారు.

ప్రతిరోజు మీరు చేయగలిగే మరియు ఇష్టమైన వ్యాయామాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు ఏదైనా అవుట్ డోర్ గేమ్ ఆడడం, డాన్స్, ఎక్కువ దూరం నడవడం, రన్నింగ్ చేయడం వంటివి.

6. పెరుగుదలను ఆపే పదార్థాలు తీసుకోవడం మానేయండి. డ్రగ్స్ మరియు ఆల్కహాల్ మీ శరీరం ఎదుగుదల ఆగిపోవడానికి కారణం అవుతాయి. మరియు ఎక్కువగా కెఫైన్ పదార్థాలు తీసుకోవడం మరియు ధూమపానం ఆపేయండి. ఎందుకంటే ఇవన్నీ శరీర పెరుగుదల మీద ప్రభావం చూపిస్తాయి.

7 తగినంత నిద్ర పోవడం మంచిది. తగినంత నిద్ర మరియు విశ్రాంతి శరీరం యొక్క మొత్తం పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతాయి. నిద్రలో మీ శరీరంలోని పిట్యూటరీ గ్రంధి గ్రోత్ హార్మోన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ శరీరం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతుంది.

నిద్ర సమయం:

2 మరియు అంత కంటే తక్కువ వయసున్న పిల్లలు 13-22 గంటలు పడుకోవడం మంచిది.

3-5 సంవత్సరాల పిల్లలు 11-13 గంటల నిద్ర అవసరం.

6-7 సంవత్సరాల వయసున్న పిల్లలకు 9 నుండి 10 గంటలు,

8-14 సంవత్సరాలు గల వారికి 8-9 గంటలు మరియు

15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గలవారికి 7- 9 గంటల నిద్ర అవసరం.

8. వంగి ఉండకుండా నిటారుగా నిలబడడం నిటారుగా నడవడం ప్రాక్టీస్ చెయ్యండి. ఇది మీరు ఎదగడానికి ఏమి సహాయపడదు కానీ మీరు కొంచెం పొడవుగా కనిపించడానికి సహాయపడుతుంది. మీరు కూర్చున్నప్పుడు మీ వీపును నిటారుగా ఉంచడం నడుస్తున్నప్పుడు స్ట్రైట్ గా నిల్చొని, భుజాలు వెనక్కి పెట్టి గడ్డం పైకెత్తి నడవడం ప్రాక్టీస్ చేయండి.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+