ratan-tata-telugu

How to get Sleep Fast Telugu-త్వరగా నిద్ర పట్టాలంటే ఏమి చెయ్యాలి?

How to Get Sleep Fast:

మనిషికి నిద్ర(Sleep) అనేది చాల అవసరం. రాత్రంతా మంచి నిద్ర పొంది ఉదయమే నిద్ర లేస్తే ఉండే ఆ హాయి వేరు. అదే ఒకవేళ రాత్రి సరైన నిద్ర లేకపోతె ఆ రోజంతా చాల చిరాగ్గా ఉంటుంది. ఏ పని చెయ్యాలనిపించదు. అయితే కొంతమందిలో నిద్రలేమి సమస్య ఉంటుంది. అంటే నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు కానీ ఎంత ప్రయత్నించినా వాళ్ళకి నిద్ర పట్టదు. ఇటువంటి వాళ్ళు ఏవేవో ఆలోచనలతో అటుఇటు దొర్లుతూ చివరికి ఎప్పుడో రాత్రి 1 లేదా 2 గంటలకి నిద్రపోతారు. దానితో వాళ్ళకి నిద్ర సరిపోదు. దీనినే Insomnia అని అంటారు. ఇటువంటి సమస్య ఉన్నవాళ్లు త్వరగా నిద్రపోవడానికి ఏమి చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.

"4-7-8" Method:

ప్రపంచంవ్యాప్తంగా ఎక్కువగా ప్రాముఖ్యత పొందిన పద్దతి ఇది. ఈ పద్దతి చాల సులువుగా ఉంటుంది అలాగే బాగా పనిచేస్తుంది కూడా.

1. ముందుగా మీ నాలిక ముందు భాగాన్ని నోటిలోని పై పళ్ళకి తాకించండి.

2. ఇప్పుడు నోటి ద్వారా పూర్తిగా గాలిని వదిలి మీ నోటిని మూయండి.

3. ఇప్పుడు మనసులో 4 వరకు అంకెలను లెక్కిస్తూ ముక్కు ద్వారా మెల్లగా గాలిని పీల్చండి.

4. శ్వాసని అలాగే పట్టి ఉంచి మనసులో 7 వరకు అంకెలను లెక్కించండి.

5. తరువాత నోటిని తెరిచి (నాలిక ముందు భాగాన్ని నోటిలోని పై పళ్ళకి తాకించి ఉంచండి) మనసులో 8 వరకు అంకెలను లెక్కిస్తూ మెల్లగా గాలిని వదలండి.

6. ఇలా మళ్ళీ మళ్లీ చేస్తూ ఉండండి.

ఇలా చేస్తే మీ నాడీ వ్యవస్థ పూర్తిగా విశ్రాంతి పొంది త్వరగా నిద్రపడుతుంది.

ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన శరీరంలో circadian rhythm అని పిలబడే నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. ఇది మన బాడీలో ఒక internal clock లా పనిచేస్తుంది. మీరు ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోతే ఈ circadian rhythm సిస్టం దానికి అలవాటుపడి ప్రతిరోజూ అదే సమయానికి ఆటోమేటిక్ గా నిద్ర పట్టేలా చేస్తుంది. దాంతో మీరు సులువుగా నిద్రపోగలుగుతారు.

నిద్రపోవడానికి అరగంట ముందు మొబైల్ గాని కంప్యూటర్ గాని వాడకండి. ఎందుకంటే వాటి నుండి వచ్చే బ్లూ లైట్ నిద్ర రావడానికి ఉపయోగపడే melatonin అనబడే హార్మోన్ విడుదల కాకుండా చేస్తుంది.దాంతో త్వరగా నిద్ర పట్టదు. దానికి బదులుగా నిద్రపోయే ముందు ఏదైనా ఒక పుస్తకాన్ని చదవండి.

ఎంతసేపటికి నిద్ర పట్టకపోతే లేచి ఏదో ఒక పనిచేసుకోండి. అంతేగాని బెడ్ మీదే ఉండి ఎంతసేపటికి నిద్ర రావడం లేదని బాధపడడం వలన ఉపయోగం ఉండదు. అలాగే ప్రతిసారి టైం చూసుకోకండి. దీని వల్ల మీలో మీకే ఒత్తిడి(pressure) పెరిగిపోతుంది. కొంతమంది కేవలం టైం చెక్ చేసుకుందామని ఫోన్ తీసి ఇంకో అరగంట పాటు మొబైల్ వాడుతూనే ఉంటాయి. కాబట్టి నిద్రపోయేటప్పుడు ఫోన్ మీకు దూరంగా ఉండేలా చూసుకోండి.

కొంతమంది పడుకునే సమయంలో ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు. రేపు చెయ్యబోయే పనుల గురించి గాని,కొన్ని ఐడియాల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఆ ఆలోచనలన్నిటిని ఒక పేపర్ మీద రాసెయ్యండి.అప్పుడు మీ మెదడు తేలికవుతుంది. అంతేకాదు నిద్రపోవడానికి ఒక గంట ముందు వేడి నీళ్లతో స్నానం చెయ్యడం, మంచి మ్యూజిక్ వినడం ఇవన్నీ కూడా త్వరగా నిద్రపట్టడానికి దోహదపడతాయి.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+