ratan-tata-telugu

How to Earn Money in Telugu - Ways to Make Money

How to make more Money in Telugu (మీ డబ్బుని రెట్టింపు చేసే మార్గాలు)

1. Stock Market:

Stock Market మీ పెట్టుబడిని రెట్టింపు చేస్తుంది. కానీ, ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది నష్టం. ఎంత వేగంతో మీ డబ్బు(Money) రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయో, అంతే వేగంతో నష్టాలు వచ్చే అవకాశాలూ లేకపోలేదు. దీనికోసం మీకు Stock Market మీద కనీస అవగాహన ఉండాలి. అందుకే ఇంగ్లీష్ లో అంటారు First Learn then remove 'L' అని. Stock market మీద కనీస అవగాహన తెచ్చుకుని, లాభ నష్టాలను భేరీజు చేసుకోగలిగి, రోజూ వారీ న్యూస్ ను పరిశీలించి సరైన కంపెనీలో ఇన్వెస్ట్ చేయగలిగితే మీ డబ్బు అతి తక్కువ సమయంలోనే రెట్టింపు అవుతుంది అనడంలో సందేహం లేదు.

Earn money tips

2. వ్యాపారం (Business):

వ్యాపారంతో డబ్బుని(Money) డబల్ చేసే మార్గాలలో ఒకటి. వ్యాపారానికి పెట్టుబడికి అధిక మొత్తంలో మూలధనం కావాలి అనేది మునపటికాలం నాటి వాదన. ఈరోజుల్లో బద్దకమే ఆసరాగా తీసుకుని దానిని వ్యాపారంగా మలుచుకుని అతి తక్కువ పెట్టుబడితో చాలా మంది కోట్లు గడిస్తున్నారు. మీరు ఉండే ప్రదేశంలో ప్రజల అవసరాలు కనిపెట్టగలిగి వాళ్ళు కదలకుండా వాళ్ళ అవసరాలను మీరు తీర్చగలిగితే అతి తక్కువ సమయంలోనే మీరు మీ డబ్బుని రెట్టింపు చేయొచ్చు.

3. Real Estate:

భూమి మీద పెట్టుబడి పెట్టి కొంత కాలం వేచి ఉండగలిగితే మీ డబ్బు(Money) రెట్టింపు అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే భూమి మీద రోజు రోజుకీ జనాభా పెరుగుతారు కానీ భూమి పెరగదు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా నివాసానికి భూమి డిమాండ్ కూడా రోజు రోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గదు. కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టగలిగితే నష్టం అనే ఆలోచనే మీరు పెట్టుకోవలసిన అవసరం లేదు. ఈ మార్గం ద్వారా మీ డబ్బు అతి తక్కువ కాలంలో రెట్టింపు అవుతుంది.

Earn money tips Telugu

4. వడ్డీలకు డబ్బు ఇవ్వడం:

నమ్మకం ఉన్న వ్యక్తులకు మీ డబ్బుని(Money) అప్పుగా ఇస్తే మీ డబ్బు తక్కువ సమయంలోనే రెట్టింపు అవుతుంది. కానీ డబ్బు ఇచ్చేటప్పుడు రాతపూర్వకమయిన Agreement తప్పనిసరి అనే నియమాన్ని మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అవతల వ్యక్తి ఎంత సన్నిహితుడయినా సరే ఇవతల ఉన్నది మీరు శ్రమించి సంపాదించిన డబ్బు అన్న విషయం మాత్రం మరిచిపోకండి.

5. Fixed Deposit చేయడం:

మన డబ్బుని బ్యాంకులో Fixed Deposit చేయడం ద్వారా కూడా డబ్బు(Money) రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లో కాకుండా కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఎక్కువ వడ్డీతో Fixed Deposit లను ప్రోత్సహిస్తున్నాయి. సంస్థ గురించిన పూర్తి వివరాలను, పూర్వ చరిత్రను, Payment విధానాలను తెలుసుకుని పెట్టుబడి పెడితే ఈ మార్గం కూడా మీ డబ్బుని రెట్టింపు చేస్తుంది.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+