ratan-tata-telugu

How to Get More Followers on Instagram in Telugu

7 Ways to Get More Followers on Instagram:

ఈ రోజుల్లో ఎక్కువ మంది యువత ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ఆప్ లలో ఇన్ స్టాగ్రామ్(Instagram) కూడా ఒకటి. వ్యక్తిగత జీవితం నుండి వ్యాపార, వృత్తి పరమైన అంశాలను పంచుకోవడానికి ఒక మంచి ఆన్లైన్ వేదిక ఈ ఇన్ స్టాగ్రామ్.

అటువంటి ఈ ఇన్ స్టాగ్రామ్(Instagram) లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండడం అనేది ఒక గొప్ప అంశంగా పరిగణించబడుతుంది. కొంతమంది తమని తాము ఎక్కువ మందికి పరిచయం చేసుకోవడానికి ఫాలోవర్లను పెంచుకుంటే, కంపెనీలు, బ్రాండ్లు తమ వ్యాపారాన్ని ఎక్కువ మందికి చేరవేయడానికి, సెలెబ్రెటీలు తమ అభిమానులకు చేరువలో ఉండడానికి ఇలా ఎవరికి వారు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్లను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

మరి ఇక అసలు విషయానికి వస్తే, ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్లను పెంచుకోవడానికి, ఇన్ స్టాగ్రామ్ లో ఫేమస్ అవ్వడానికి(Become Famous on Instagram)  7 అద్భుతమైన మార్గాలు (7 Ways to get more followers on Instagram) ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1.ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ని ఆప్టిమైజ్ చెయ్యడం (Optimize Your Instagram Profile):

ఏదో ఒక పేరు పెట్టేసి, నాలుగు మాటలు రాసేసి, ఒక ఫోటో ని ప్రొఫైల్ పిక్చర్ లాగా అప్లోడ్ చేస్తే అది ఆప్టిమైజ్డ్ అకౌంట్ అవ్వదు. ఒకవేళ మీరు ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించాలి అనుకుంటే మీరు వేయవలసిన మొదటి అడుగు ఒక ప్రొఫెషనల్ గా అకౌంట్ ని క్రియేట్ చెయ్యడం. మీ అకౌంట్ పేరు ని మీ బ్రాండ్ కి తగినట్టు లేదా ఇతర సోషల్ మీడియా లో పాపులర్ అయిన మీ పేరు ని పెట్టుకోండి. బయో(Bio) లో మీ గురించి లేదా మీ బ్రాండ్ గురించి ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ ని రాయండి. ఒకవేళ మీరు ఏదయిన బ్రాండ్ గురించి లేదా మీ సొంత వ్యాపారాల గురించి ప్రమోట్ చెయ్యాలి అనుకుంటే అప్పుడు అందుకు సంబందించిన లింక్ ని మీ బయో, హోమ్ పేజీలలో ఇవ్వడం మంచిది. సరైన ప్రొఫైల్, బయో, ఇమేజ్ కాప్షన్లు లేకుండా ఫాలోవర్లు రావడం అనేది చాలా కష్టం.

2. సరికొత్త హ్యాష్ ట్యాగ్ (Hashtag) లను ఉపయోగించడం

హ్యాష్ ట్యాగ్ (Hashtag) - మీకంటూ ఎక్కువ మంది ఫాలోవర్లను తెచ్చిపెట్టగలదు. ఎందుకంటే అసాధారణమైన హ్యాష్ ట్యాగ్ లు మీకంటూ ఒక గుర్తింపుని తీసుకువస్తాయి. మీ వినూత్న ఆలోచనలను తెలియచెప్పడానికి మీరు ఈ హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగిస్తే, అవి మిమ్మల్ని మరింత పాపులర్ చేస్తాయి. మీకంటూ ఎంత క్రియేటివిటీ ఉన్నా, దానిని సరైన పద్దతిలో వినియోగించకపోతే ఎక్కువ మంది ఫాలోవర్లను ఇన్ స్టాగ్రామ్ లో మీరు సంపాదించలేరు. కాబట్టి సందర్భాన్ని బట్టి, మీ ఆలోచనలను ఒక వినూత్న హ్యాష్ ట్యాగ్ తో పంచుకోండి.

ఇన్ స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

3. ఒక ఖచ్చితమైన క్యాలెండర్ ని ఫాలో అవ్వడం:

రోజులో ఏ సమయాల్లో పోస్టులు చెయ్యాలి, ఎలాంటి సందర్భంలో ఎలాంటి పోస్టులు పెట్టాలి అని మీరు ఒక నిర్దేశిత క్యాలెండరు ని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఎన్ని పోస్టులు పెడుతున్నారు అనే దానికంటే ఏ టైమ్ లో పెడుతున్నారు అనేది ముఖ్యం. మీ ఫాలోవర్లు ఎలాంటి సమయాల్లో పోస్టులు ఎక్కువగా చూస్తారో, ఎలాంటి పోస్టులు ఇష్టపడతారో ఒక సర్వే చెయ్యండి. వాటి ఆధారంగా మీరు పోస్టులని క్రియేట్ చేసి క్రమం తప్పకుండ పోస్ట్ చేస్తూ ఉండండి.

4. లైవ్ వీడియోస్, స్టోరీస్ (Live Videos & Stories) లను ఎక్కువగా అప్లోడ్ చెయ్యండి:

చాలా మంది ఫోటోలు పోస్ట్ చేస్తున్నాం కదా, వీడియోస్ దేనికిలే, ఫొటోస్ తోనే ఫాలోవర్లను పెంచుకుందాం అనుకోవచ్చు. మారుతున్న నేటి ప్రపంచంలో ఎక్కువ శాతం యూజర్లు వీడియోస్ కే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మీరు వీడియోస్, లైవ్ వీడియోస్ , స్టోరీ లను ఎక్కువగా అప్లోడ్ చెయ్యండి. బ్రాండ్లను ప్రమోట్ చేసే సమయంలో వీలైనంత స్టోరీ లను అప్లోడ్ చెయ్యడం యూజర్ల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అని కొన్ని సర్వే లు రుజువుచేశాయి.

5. ఫాలోవర్లు (Followers) కోరుకునే కంటెంట్ ని పోస్టు చెయ్యడం:

కొంతమంది తమ బ్రాండ్ ని పాపులర్ చేసే పనిలో ఫాలోవర్లు తమ నుండి ఏం కోరుకుంటారో తెలుసుకోరు. అలాంటి సందర్భాల్లో కొత్త ఫాలోవర్లు రాకపోగా, ఉన్న ఫాలోవర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టవచ్చు. కాబట్టి, మీ ఫాలోవర్లు ఎలాంటి కంటెంట్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారో రీసెర్చ్ చెయ్యండి. దానికి అనుగుణంగా మీరు కంటెంట్ ని అప్లోడ్ చెయ్యండి . ట్రెండింగ్ విషయాల గురించి పోస్టులు చెయ్యడం వల్ల మీ ఫాలోవర్లకు సామాజిక విషయాల గురించి అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుంది. మీ ఫాలోవర్ల కౌంట్ ని కూడా పెంచుతుంది.

6. లైవ్ చాట్, Q & A ని ప్రారంభించడం:

మీ ఫాలోవర్లు మీ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలని అనుకుంటారు. అందుకోసం మీరు బెస్ట్ టైమ్ చూసి వాళ్ళతో లైవ్ చాట్ చెయ్యడం కానీ, లేదంటే Question and Answer session లో పాల్గొనడం మీకు మరింత అభిమానుల్ని తెచ్చిపెడుతుంది. మీరు వాటి గురించి ముందే పోస్టు చేసి, వారి ఆసక్తి ని పెంచాలి. మీరు క్లిష్టమైన ప్రశ్నలకు కూడా తెలివైన సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. మీ సమాధానాలు మీ అభిమానుల జాబితాను పెంచేందుకు ఎంతో సహాయపడతాయి.

7. విభిన్న శైలి ని ఎంచుకోవడం:

లక్ష మందిలో ఒకరు గా ఉండటం కన్నా లక్ష మందికి ఒకరిలా ఉన్నవారిని ఎక్కువ మంది అభిమానిస్తారు. కాబట్టి, మీకంటూ ఒక విభిన్న శైలి ని ఎంచుకోండి. మీ ప్రొఫైల్ ఫోటో (Profile Photo) నుండి మీ హోమ్ పేజీ దాకా వినూత్న శైలి లో ఉండేలా చూసుకోండి. మీ పేజీ కి, ఇతర పేజీలకు గుర్తించదగిన భేదాలు ఉండేలా మీ పేజీ ని మలుచుకోండి.

పైన చెప్పిన పద్దతులను పాటించడం ద్వారా మీరు ఇన్ స్టాగ్రామ్(Instagram) లో ఎక్కువ మంది ఫాలోవర్ లను సంపాదించగలరు. ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్ లు ఉండడం అనేది మిమ్మల్ని ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ గా మార్చడమే కాదు, ఇన్ స్టాగ్రామ్ నుండి డబ్బులు కూడా సంపాదించేలా చేస్తుంది. దానికోసం ఇంతకు ముందు మన వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన " ఇన్ స్టాగ్రామ్ నుండి డబ్బులు సంపాదించడం ఎలా?" అనే పోస్ట్ ని చదవండి.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+