ratan-tata-telugu

SEO in Telugu - Search Engine Optimization Tutorial

What is SEO(Search Engine Optimization):

SEO: మనం గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మొదటి పేజీలో ముందు వచ్చిన వెబ్ సైట్ లను మాత్రమే క్లిక్ చేస్తాము, మహా అయితే రెండవ పేజిలోకి వెళ్తాము. అంతకు మించి వెళ్ళము. కానీ ఇంటర్నెట్ లో ఎన్నో వెబ్ సైట్ లు ఉండగా కొన్ని మాత్రమే మొదటి పేజీలో ఎందుకు వస్తాయి? అలా రావాలంటే ఏం చెయ్యాలి? అనేది వివరంగా తెలుసుకుందాం.

మీరు ఒక వెబ్ సైట్ ని రన్ చేస్తున్నా గాని లేదా యూట్యూబ్ లో ఛానల్ ఉన్నా గాని మీ వెబ్ సైట్ లేదా వీడియో మొదటి పేజీలో వచ్చేలా చెయ్యడం చాలా అవసరం. అలా మొదటి పేజీలో వచ్చినప్పుడు మాత్రమే మీ వెబ్ సైట్ కి లేదా మీ వీడియో కి ఎక్కువ వ్యూస్ వస్తాయి. కాబట్టి మీరు మీ వెబ్ సైట్ గూగుల్ లో గాని లేదా మరేదైనా సెర్చ్ ఇంజన్ (Search Engine) లో గాని మొదటి పేజీలో రావాలంటే మీరు ఖచ్చితంగా SEO (Search Engine Optimization)గురించి తెలుసుకోవాలి. మీ వెబ్ సైట్ కి SEO ఎంత బాగుంటే మీ పేజీ ర్యాంక్ (Page Rank) అంత బాగుంటుంది.అలాగే ఫస్ట్ పేజీ లో కనిపిస్తుంది. ఈ SEO అనేది చాల పెద్ద సబ్జెక్ట్. కాబట్టి కొంచెం ఓపికతో నేర్చుకుంటే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

మన వెబ్ సైట్ కి సెర్చ్ ఇంజిన్ నుండి రెండు రకాలుగా వ్యూస్ వస్తాయి. 1.Paid Traffic 2.Organic Traffic

1.Paid Traffic

మన వెబ్ సైట్ మొదటి పేజీలో రావడం కోసం గూగుల్ కి లేదా ఆ సెర్చ్ ఇంజిన్ కి కొంత డబ్బు చెల్లించాలి. అప్పుడు గూగుల్ మన వెబ్ సైట్ ని మొదటి పేజీలో చూపిస్తుంది. దీని వలన ఎక్కువగా వ్యూస్ వస్తాయి.

2.Organic Traffic:

Organic Traffic అంటే మన గూగుల్ కి ఎటువంటి డబ్బులు చెల్లించక పోయిన మన వెబ్ సైట్ ర్యాంకింగ్ (Website Ranking) బాగుండడం వలన మొదటి పేజీలో చూపిస్తుంది. దాని వలన మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. దీనికి మనం ఎటువంటి డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు. దీనిని Organic Traffic అని అంటారు.

మన వెబ్ సైట్ కి ఫ్రీ గా సెర్చ్ ఇంజిన్ నుండి వచ్చే ఆర్గానిక్ ట్రాఫిక్ (Organic Traffic) ని పెంచే ప్రాసెస్ నే SEO అని అంటారు. SEO అంటే Search Engine Optimization. ఈ SEO అనేది రెండు రకాలు 1. On-page SEO 2. Off-page SEO. మన వెబ్ సైట్ ర్యాంకింగ్ బాగుండాలనుంటే ఈ రెండు కూడా ముఖ్యమే.

1. On-page SEO: మన వెబ్ సైట్ ర్యాంకిగ్ (Website Ranking) పెరగడం కోస మనం మన వెబ్ సైట్ లో చెయ్యవలసిన లేదా అమలు పరచవలసిన కొన్ని అంశాలను On-page SEO అని అంటారు.

2. Off-page SEO.మన వెబ్ సైట్ ర్యాంకిగ్ పెరగడం కోస మనం మన వెబ్ సైట్ లో కాకుండా బయట తీసుకోవాలిసిన చర్యలను Off-page SEO అని అంటారు.

ఇపుడు వీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం.

On-page SEO:

1. మనం రాసిన ఆర్టికల్ కి ఉండే టైటిల్ అనేది అందరూ ఏ విధంగా ఎక్కువగా వెతుకుతారో ఆ కీవర్డ్స్ (Keywords) ఉపయోగించి టైటిల్ ఇవ్వడం.

2. ఆర్టికల్ అందరికి ఉపయోగపడేలా అలాగే వాటిలో ముఖ్యమైన కీవర్డ్స్  (Keywords) ఉండేలా చూసుకోవాలి .

3. ఆ పోస్ట్ కి సంబందించిన URL అనేది సాధ్యమైనంత చిన్నగా ఉండాలి.

4. మీరు రాసిన ఆర్టికల్ లో మీ వెబ్ సైట్ లోనే మరొక ఆర్టికల్ కి సంబందించిన లింక్ ఇంటర్నల్ లింక్ (Internal Link) గా ఇవ్వడం. అలాగే ఇతరుల వెబ్ సైట్ లకి సంబందించిన లింక్ ఇవ్వడం. వీటిని అవుట్ బౌండ్ లింక్ (Outbound Link) అని అంటారు. ( కాకపోతే మీరు రాసిన ఆర్టికల్స్ కి సంబందించినవి మాత్రమే లింక్స్ ఇవ్వాలి అలాగే అవసరం ఉంటేనే ఇవ్వాలి గాని ఏవి పడితే ఆ లింక్స్ ఇవ్వకూడదు.)

5. వెబ్స్ సైట్ డిజైన్ యూసర్ ఫ్రెండ్లీ (User Friendly) గా ఉండేలా చూసుకోవాలి.

6. వెబ్ సైట్ స్పీడ్ (Website Speed) ఫాస్ట్ గా ఉండేలా చూసుకోవడం. అంటే ఎవరైనా వెబ్ సైట్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మన పేజీ లోడ్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే లోడ్ అవ్వాలి.

7. అందరికి ఉపయోగపడేలా ఎక్కువ పదాలు ఉండేలా మంచి కంటెంట్ ఉన్న ఆర్టికల్ రాయాలి.

8. మంచి కంపెనీ నుండి హోస్టింగ్ (Hosting) తీసుకోవడం. ఎందుకంటే మన వెబ్ సైట్ కి ఎక్కువ వ్యూస్ వస్తున్నపుడు ఆ ట్రాఫిక్ కి తట్టుకోగలిగే హోస్టింగ్ చాలా అవసరం. కాబట్టి హోస్టింగ్ తీసుకునేటప్పుడు Speed, Bandwidth , Space అన్ని చూసుకుని బెస్ట్ హోస్టింగ్  తీసుకోవాలి. హోస్టింగ్ లో బ్లూ హోస్ట్ (Blue Host)కంపెనీ బాగా ప్రాచుర్యం పొందింది.  ప్రస్తుతం ఆఫర్ లో భాగంగా తక్కువ ధరకే Blue Host కంపెనీహోస్టింగ్ అందిస్తుంది. ఒకవేళ మీరు హోస్టింగ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి. >>Blue Host

పైన చెప్పినవన్నీ కూడా మన వెబ్ సైట్ లో చెయ్యవలసినవి. కాబట్టి ఇవన్నీ కూడా On-page SEO లోకి వస్తాయి.

Off-page SEO:

1. Link Building:

Off-page SEO లో ముఖ్యమైనది లింక్ బిల్డింగ్(Link Building). అంటే వేరే వాళ్ళ వెబ్ సైట్ లలో మన వెబ్ సైట్ కి సంబందించిన లింక్ ఇవ్వడం. దీనిని బ్యాక్ లింక్ (Back Link) అని అంటారు . అంటే వేరే వెబ్సైటు వాళ్ళు మన వెబ్ సైట్ ని రెఫరెన్సు (Reference) గా చూపిస్తూ మన వెబ్ సైట్ లింక్ వాళ్ళ ఆర్టికల్ లో ఇస్తారు. ఇలా ఎన్ని ఎక్కువ బ్యాక్ లింక్స్ (Back Links) ఉంటే మన వెబ్ సైట్ ర్యాంకింగ్ (Website Ranking) అనేది అంత ఎక్కువగా పెరుగుతుంది.

2. Social Media:

మన వెబ్ సైట్ రాసిన ఆర్టికల్స్ అనేవి ఫేస్బుక్ , ట్విట్టర్, వంటి సోషల్ మీడియా వెబ్ సైట్ లలో ఎంత ఎక్కువగా షేర్ (Share) అయితే అంతలా మన పేజీ ర్యాంకింగ్ పెరుగుతుంది.

ఈ విధంగా మనం మన వెబ్ సైట్ లోSEO కి అనుగుణంగా ఆర్టికల్స్ రాస్తే మన వెబ్ సైట్ కూడా గూగుల్ లో మొదటి పేజీలో కనపడుతుంది. ఈ ఆర్టికల్ SEO గురించి ఒక అవగాహన రావడం కోసమే. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తరువాత రాబోయే ఆర్టికల్ లలో ఒక్కొక్కదాని గురించి పూర్తగా తెల్సుకుందాం. SEO కి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటె కింద కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి.

You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+