ratan-tata-telugu

How to Make Money on Instagram in Telugu - Earn Money Online

Best Ways to Make Money on Instagram in Telugu:

ఈ రోజుల్లో Instagram ఎంత ఫేమస్ అయ్యిందో మన అందరికి తెలిసిందే. ఫొటోస్ ని షేర్ చేసుకునే ఆప్ గా మొదలైన ఇన్ స్టాగ్రామ్ ఇప్పుడు బెస్ట్ సోషల్ మీడియా ఆప్ లలో ఒకటిగా నిలిచింది. అయితే చాల మంది తమ ఫొటోస్ ని షేర్ చేసుకోవడానికి మాత్రమే ఇన్ స్టాగ్రామ్ ని ఉపయోగిస్తున్నారు. కానీ కొంతమంది దీని ద్వారా లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు.

అలా మనం కూడా Instagram ద్వారా మనీ సంపాదించాలంటే మనకు కావలసిందల్లా ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్స్ ఉండాలి. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. సెలబ్రెటీలకు అయితే ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు గాని మనలాంటి సాధారణ వ్యక్తులకు అంతమంది ఫాలోవర్స్ ఎలా వస్తారు అని. కానీ ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ రావాలంటే ఒక సెలబ్రిటీ నే కానవసరం లేదు.

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

మీకు ఇంటరెస్ట్ ఉన్న ఏదైనా ఒక కేటగిరి ని తీసుకుని దానికి సంబంధించి ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీ ని క్రియేట్ చేసి దానిలో ఆ కేటగిరికి సంబంధించి ప్రతి రోజు మంచి పోస్ట్ లు పెడుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఫాలోవర్స్ వస్తూ ఉంటారు. కాకపోతే దానికి సమయం పడుతుంది. ఇన్ స్టాగ్రామ్ పేజీ కి ఎక్కువ మంది ఫాలోవర్స్ ని ఎలా పొందాలి అనే టాపిక్ గురించి మనం తరువాతి పోస్ట్ లలో తెలుసుకుందాం.

ఇప్పుడు Instagram ద్వారా మనీ ఎలా సంపాదించాలో చూద్దాం. ఇన్ స్టాగ్రామ్ లో మూడు మార్గాల ద్వారా మనీ సంపాదించవచ్చు.

1. Influencer గా మారడం

2. Affiliate Marketing చేయడం

3. మన సొంత ప్రొడక్ట్స్ ని అమ్మడం

వీటిలో ఒక్కొక్కదాని గురించి వివరంగా తెలుసుకుందాం

1. Influencer గా మారడం:

ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ మంది డబ్బు సంపాదించే మార్గం ఇదే. మన పేజీ కి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు మన పేజీ ఏ కేటగిరి కి చెందిందో ఆ రంగానికి చెందిన కొన్ని కంపెనీలు మనల్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ బ్రాండ్ కి సంబందించిన పోస్ట్ ని మన పేజీలో పెట్టమని అడుగుతారు. అలా మనం పోస్ట్ చేసినందుకు గాను వాళ్ళు కొంత డబ్బు మనకి ఇస్తారు. ఎంత మనీ ఇస్తారు అనేది మన పేజీ కి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు?, మనం ఒక పోస్ట్ పెడితే ఎంత engagement ఉంది? అంటే పోస్ట్ కి ఎన్ని లైక్ లు, కామెంట్ లు షేర్ లు వస్తున్నాయి ? వీటన్నింటి పరిగణలోకి తీసుకుని దానిని బట్టి అమౌంట్ ఇస్తారు. ప్రపంచంవ్యాప్తంగా ఎంతో మంది సెలెబ్రిటీలు తమ ఇన్ స్టాగ్రామ్ పేజీ లో బ్రాండ్ కి సంబందించిన ఒక పోస్ట్ అప్లోడ్ చేసినందుకు గాను కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటారు.

మనం కూడా మన ఇన్ స్టాగ్రామ్ పేజీ కి ఎక్కవు మంది ఫాలోవర్స్ ని సంపాదిస్తే కోట్లలో కాకపోయినా కనీసం వేలల్లో అయినా సంపాదించవచ్చు. దీని కోసం మనం చేయవలసిందల్లా ఎక్కువ మంది ఫాలోవర్స్ ని సంపాదించడం, వాళ్ళు మన పోస్ట్ ని లైక్ , షేర్ చేసేలా మంచి కంటెంట్ ని పోస్ట్ చేస్తే చాలు.

2. Affiliate Marketing చేయడం:

ఆన్ లైన్ ద్వారా మనీ సంపాదించాలి అనుకునేవారికి affiliate అనేది ఒక మంచి మార్గం. ఇన్ స్టాగ్రామ్ పేజీ ని ఉపయోగించి affiliate ద్వారా మనీ ఎలా సంపాదించాలో చూద్దాం.

ఉదాహరణకి మీకు వేలల్లో ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక టెక్నాలజీ కి సంబందించిన ఇన్ స్టాగ్రామ్ పేజీ ఉంది అనుకుందాం. మీరు రీసెంట్ గా విడుదలైన ఒక ఫోన్ గురించి గాని, laptop గురించి గాని, లేదా మరే ఇతర Gadget గురించి గాని ఒక పోస్ట్ ని అప్లోడ్ చేసి ఆ ప్రొడక్ట్ కి సంబందించిన affiliate లింక్ ని మీ ఇన్ స్టాగ్రామ్ పేజీ బయో లో ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైనా ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ ప్రొడక్ట్ ని కొంటె ఆ ప్రొడక్ట్ కాస్ట్ లో 3 నుండి 5% వరకు మనకు వస్తుంది. ఎంత ఎక్కవ మంది ఆ ప్రొడక్ట్స్ ని కొంటె మీకు అంత మనీ వస్తుంది. దీనినే affiliate marketing అని అంటారు. దీనికోసం మీరు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సైట్లలో affiliate గా జాయిన్ అవ్వాలి.

3. మన సొంత ప్రొడక్ట్స్ ని అమ్మడం:

పైన చెప్పిన రెండు మార్గాలలో మనం వేరే వాళ్ళ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ మార్గంలో మన స్వంత ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసుకుంటాం. దాని కోసం మనకంటూ ఒక సొంత ప్రొడక్ట్ ఉండాలి. చాలామంది ఒక e-book రాసి అమ్మడం, లేదా ఒక కోర్స్ ని క్రియేట్ చేసి అమ్మడం, లేదా వాళ్ళ వెబ్సైటు ని గాని వాళ్ళ సర్వీసెస్ ని గాని ప్రమోట్ చేసుకోవడం చేస్తుంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తికి స్టాక్ మార్కెట్ లో మంచి నైపుణ్యం ఉంది అనుకుందాం. అతను స్టాక్ మార్కెట్ గురించి ఒక కోర్స్ ని క్రియేట్ చేసి దానిని తన ఇన్ స్టాగ్రామ్ పేజీ ద్వారా ప్రమోట్ చేసుకుంటారు. ఈ విధంగా మన సొంత ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసుకుని కూడా మనీ సంపాదించవచ్చు.

అదేవిధంగా ఇన్ స్టాగ్రామ్ లో Shoutouts ద్వారా కూడా మనీ సంపాదించవచ్చు. అంటే వేరే పేజీ వాళ్ళు తమ పేజీ ని మన పేజీ లో ప్రమోట్ చెయ్యమని అడుగుతారు. వీటిని Shoutouts అని అంటారు. అలా Shoutouts చేసినందుకు గాను కొంత అమౌంట్ పే చేస్తారు.

అలాగే ఇన్ స్టాగ్రామ్ లో IGTV ద్వారా వీడియోస్ అప్లోడ్ చేసి కూడా మనీ సంపాదించవచ్చు. యూట్యూబ్ తరహాలోనే ఇన్ స్టాగ్రామ్ కూడా వీడియో మధ్యలో యాడ్స్ ని పెట్టి క్రియేటర్ కి మనీ ఇస్తుంది.

ఈ విధంగా Instagram ద్వారా చాలా రకాలుగా మనం మనీ సంపాదించవచ్చు. అయితే మనం ముందు డబ్బు మీద కాకుండా ఎక్కువ మంది ఫాలోవర్స్ ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తే ఆటోమేటిక్ గా మనీ కూడా వస్తుంది. కాబట్టి మీకు ఏ కేటగిరి అయితే ఇంటరెస్ట్ ఉందో అది టెక్నాలజీ, హెల్త్, బిజినెస్, ఎడ్యుకేషన్, కుకింగ్ ఇలా ఏదైనా సరే ఒక కేటగిరి ని ఎంచుకుని, ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీని క్రియేట్ చేసి రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ ఫాలోవర్స్ ని పెంచుకోండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా కూడా షేర్ చెయ్యండి. అలాగే త్వరలో మా నుండి వచ్చే ఆర్టికల్స్ ని మిస్ కాకుండా ఉండడానికి టెలిగ్రామ్ లో తెలుగుబడి గ్రూప్ లో చేరండి.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+