ratan-tata-telugu

Google AdSense in Telugu- How to get Google AdSense Approval

What is Google AdSense:

మీరు ఆన్ లైన్ ద్వారా మనీ సంపాదించాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా Google AdSense గురించి తెలుసుండాలి. ఒకవేళ మీకు ఒక వెబ్ సైట్ గాని యూట్యూబ్ ఛానల్ గాని ఉండి వాటికి వ్యూస్ వస్తున్నట్లయితే మీరు Google AdSense ద్వారా మనీ సంపాదించవచ్చు. ఒకరకంగా చెప్పాలి అంటే AdSense నుండి approval పొందడం అనేది ప్రతి Blogger కి ఒక కల.

Google AdSense అంటే ఏమిటి?

ఈ AdSense అనేది గూగుల్ కి సంబందించిన Advertisement program. ఒకవేళ మీకు వెబ్ సైట్ ఉండి మీరు ఈ AdSense లో Publisher గా చేరితే ఈ AdSense మీ వెబ్ సైట్ లో యాడ్స్ ని dispaly చేస్తుంది. అలా మీ వెబ్ సైట్ ని చూసే వాళ్లలో ఎవరైనా ఈ యాడ్స్ ని చూసినా లేక ఆ యాడ్స్ మీద క్లిక్ చేసిన మీకు ఈ AdSense మనీ ఇస్తుంది.


ఈ రోజుల్లో ఆన్ లైన్ లో దాదాపుగా ప్రతి వెబ్ సైట్ లోను ఈ Google Ads ని చూస్తున్నాం. అయితే ఇలా AdSense లాంటి Ad networks చాలా ఉన్నాయి కానీ వాటన్నిటికన్నా కూడా AdSense చాలా బెస్ట్.



అయితే మన వెబ్ సైట్ లో యాడ్స్ ప్లే అవ్వాలంటే ముందు మనం ఈ AdSense కి అప్లై చేసుకోవాలి. అప్పుడు Google AdSense మన వెబ్ సైట్ ని పూర్తిగా పరిశీలించి మన వెబ్ సైట్ వాళ్ళ పాలసీలకు సరిపోతే అప్పుడు మనకు గూగుల్ యాడ్ సెన్స్ నుండి అనుమతి లభిస్తుంది.

కానీ యాడ్ సెన్స్ నుండి అనుమతి రావడం అనేది కొంచెం కష్టమనే చెప్పాలి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన త్వరగా యాడ్ సెన్స్ నుండి approval పొందవచ్చు.

చాలా మంది చేసే తప్పు ఏమిటంటే Google AdSense కి సంబందించిన నియమ నిబంధనలు తెలుసుకోకుండా వెబ్ సైట్ ని మొదలుపెట్టిన వెంటనే యాడ్ సెన్స్ కి అప్లై చేస్తూ ఉంటారు. అందుకే చాలా మందికి యాడ్ సెన్స్ రిజెక్ట్ అవుతుంది.

కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గూగుల్ యాడ్ సెన్స్ అనుమతి సులభంగా పొందవచ్చు .

Google AdSense నుండి Approval పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. మన వెబ్ సైట్ లో మీరు వ్రాసే కంటెంట్ 100% సొంతంగా రాసినదై ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళ వెబ్ సైట్ లో కాపీ చేసి మన వెబ్ సైట్ లో వ్రాయకూడదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి గూగుల్ మనకన్నా చాలా తెలివైనది. మనం ఒకవేళ ఇలా కాపీ చేసి వ్రాస్తే ఏదో ఒకరోజు గూగుల్ కనిపెట్టగలదు.

2. మనం గూగుల్ యాడ్ సెన్స్ కి అప్లై చేసే ముందు మీ వెబ్ సైట్ లో సరిపడినంత కంటెంట్ ఉండేలా చూసుకోండి. అంటే వెబ్ సైట్ లో కనీసం 20 నుండి 30 ఆర్టికల్స్ అయినా ఉంటే మంచిది. అలాగే ఒక్కొక్క ఆర్టికల్ లో కనీసం 500 పదాలు ఉండేలా చూసుకోండి. గ్రామర్ తప్పులు లేకుండా వ్రాయండి. మన వెబ్ సైట్ లో ఎంత ఎక్కువ కంటెంట్ ఉంటే అంత మంచిది.

3. మన వెబ్ సైట్ డిజైన్ అనేది చక్కగా ఉండేలా చూసుకోండి. మన వెబ్ సైట్ ని ఓపెన్ చేసిన వెంటనే ముందు అందరూ గమనించేది వెబ్ సైట్ డిజైన్, కాబట్టి అందరిని ఆకట్టుకునేలా వెబ్ సైట్ ని తయారుచెయ్యండి. అది జనాలకు నచ్చిందంటే గూగుల్ కి కూడా నచ్చుతుంది.

4. మీరు గూగుల్ యాడ్ సెన్స్ కి అప్లై చేయాలి అనుకుంటే మీ కనీసం వయసు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఒకవేళ 18 సంవత్సరాలలోపు ఉంటే మీ తల్లిదండ్రుల Gmail అకౌంట్ ద్వారా Google AdSense కి అప్లై చెయ్యవచ్చు.

5. ఒకవేళ మీ వెబ్ సైట్ లో ఆయుధాలు, డ్రగ్స్,సెక్స్, హ్యాకింగ్ వంటి చట్ట విరుద్ధమైన కంటెంట్ గాని ఉంటే యాడ్ సెన్స్ మీకు Approval ఇచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇటువంటి కంటెంట్ ని మీ వెబ్ సైట్ లో లేకుండా చూసుకోండి.

6. యాడ్ సెన్స్ కి అప్లై చేసే ముందు మీ వెబ్ సైట్ లో ఇతర Ad network లకు సంబంధించిన యాడ్స్ ఏవైనా ఉంటే వాటిని తొలగించండి.

ఇలా పైన చెప్పిన రూల్స్ అన్ని పాటిస్తే మీకు త్వరగా యాడ్ సెన్స్ అప్రూవల్ వచ్చే అవకాశం ఉంది.

అయినా గాని ఒకవేళ గూగుల్ యాడ్ సెన్స్ మీ వెబ్ సైట్ ని రిజెక్ట్ చేస్తే కంగారు పడవలసిన అవసరం లేదు. మీ వెబ్ సైట్ కి ఎందుకు అనుమతి లభించలేదో వాటికి కారణాలేంటో తెలుపుతూ మీకు ఒక మెయిల్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏ కారణాల వల్ల అయితే రిజెక్ట్ చేసారో వాటిని సరిదిద్దుకుని తిరిగి మళ్లీ అప్లై చేయండి. ఖచ్చితంగా approval వస్తుంది

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే యాడ్ సెన్స్ నుండి అనుమతి వచ్చిన తరువాత కూడా మనం చాల జాగ్రత్తగా ఉండాలి.

కొంతమంది ఎక్కువ డబ్బులు రావాలని వాళ్ళ వెబ్ సైట్ లోని యాడ్స్ వారే చూసుకోవడం, ఆ యాడ్స్ మీద క్లిక్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అటువంటి పనులు చేస్తే యాడ్ సెన్స్ అకౌంట్ వెంటనే cancel అవుతుంది.

యాడ్ సెన్స్ లో రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. వాళ్ళ రూల్స్ కి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే నిర్దాక్షణంగా అకౌంట్ రద్దు చేయబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

ముందు వెబ్ సైట్ ని స్టార్ట్ చేసిన తరువాత ఒక మూడు నెలల వరకు యాడ్ సెన్స్ గురించి మర్చిపోండి. పైన చెప్పిన జాగ్రత్తలు అన్ని పాటిస్తూ ముందు వెబ్ సైట్ ని perfect గా రెడీ చెయ్యండి. ఆ తరువాత అప్లై చెయ్యండి.

మీరు Google AdSense కి అప్లై చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.>> Google AdSense Signup



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+