ratan-tata-telugu

How to Earn Money on Fiverr -Make Money as a Freelancer

How to Earn Money on Fiverr:

మనలో ఒక్కక్కరిలో ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. ఒకరు బాగా ఆర్టికల్స్ వ్రాయగలరు, మరొకరు క్రియేటివ్ గా లోగో లు డిజైన్ చెయ్యగలరు, ఒకరు ఇంగ్లీష్ నుండి తెలుగు లోకి లేదా తెలుగు నుండి ఇంగ్లీష్ నుండి ట్రాన్సలేట్ చెయ్యగలరు, కొంతమంది వీడియోలు ఎడిటింగ్ చెయ్యగలరు ఇలా మీలో ఏ స్కిల్ ఉన్నా సరే దాని నుండి మీరు ఆన్ లైన్ ద్వారా మనీ సంపాదించవచ్చు. దీనినే ఫ్రీలాన్సింగ్ (Freelancing) అని అంటారు.

ఈ రోజుల్లో అందరికి ఉద్యోగం దొరకాలంటే కష్టం. అలాంటప్పుడు మనకు మనమే మన దగ్గర ఉన్న స్కిల్స్ ని ఉపయోగించుకుని లేదా కొత్త స్కిల్స్ ని నేర్చుకుని వాటి ద్వారా ఉపాధిని కల్పించుకోవాలి. ఇలా ఎంతో మంది ఇంటి నుండే తమకు ఉన్న స్కిల్ ని ఉపయోగించుకుని మనీ సంపాదిస్తున్నారు. ఇలా సంపాదించే వాళ్ళను ఫ్రీలాన్సర్స్ (Freelancers) అని అంటారు.

ఇలా ఫ్రీలాన్సింగ్ ద్వారా మనీ సంపాదించడానికి ఆన్ లైన్ లో చాలా వెబ్ సైట్ లు ఉన్నాయి. వాటిలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన నమ్మకమైన వెబ్ సైట్ “Fiverr“. దీనిలో వర్క్ అంతా కూడా గిగ్స్ (Gigs) ద్వారా జరుగుతుంది. Gigs అంటే ఉదాహరణకు మీరు వీడియో ఎడిటింగ్ బాగా చెయ్యగలనుకోండి. అప్పుడు మీరు ” నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను” అని ఒక Gig క్రియేట్ చేసుకోవాలి. క్రింద ఫోటో లో కనపడుతున్నవాటిని Gigs అని అంటారు.


free


ఇప్పుడు ఎవరికైనా వీడియో ఎడిటింగ్ కావలసిన వాళ్లు(Buyers) ఈ Fiverr వెబ్ సైట్ లో వెతికినప్పుడు వాళ్లకు మీ Gig కనిపిస్తుంది. వాళ్లకు మీ ప్రొఫైల్ నచ్చితే వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు. అయితే ఒకరు మీకు ప్రాజెక్ట్ అప్పగించే ముందు మీ రేటింగ్ ఎంత ఉంది. ఇంతకు ముందు మీకు వర్క్ ఇచ్చిన వాళ్ళు మీకు ఏ విధమైన రివ్యూ లు ఇచ్చారో చెక్ చేసుకుని, అన్ని బాగున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తారు. కాబట్టి మీరు మీ Gig ని ప్రొఫెషనల్ గా తయారుచేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మంచి రేటింగ్, రివ్యూ లు ఉండేలా చూసుకోండి.

మీరు చేసే వర్క్, మీకు ఉన్న రేటింగ్ పెరిగే కొద్దీ మీ లెవెల్స్ మారుతూ ఉంటాయి. మీ లెవెల్ పెరిగే కొద్దీ మీకు ఎక్కువ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అంతేకాదు వాళ్ళు ఎక్కువ డబ్బు చెల్లించి మరీ మీకు ఆర్డర్స్ ఇస్తారు. అయితే మొదట్లో మీకు రేటింగ్ లు, రివ్యూ లు ఉండవు కాబట్టి ఆర్డర్ లు రావడం కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ నిరుత్సాహపడకండి. ఇప్పుడున్న బెస్ట్ సెల్లెర్స్ కూడా మొదట్లో ఎటువంటి రేటింగ్, రివ్యూ లు లేకుండా వచ్చిన వాళ్లే. కాబట్టి మీ స్కిల్స్ గురించి పూర్తిగా వివరిస్తూ మీ Gig ని ప్రొఫెషనల్ గా తయారుచేసుకోండి. మీరు ఇంతకు ముందు చేసిన మీ వర్క్ ని కూడా మీ Gig కి జత చెయ్యండి.

ఇక Payments విషయానికి వస్తే డబ్బులు వస్తాయో రావో అని భయపడవలసిన అవసరం లేదు. Fiverr ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుంది. మీరు పూర్తి చేసిన ప్రాజెక్ట్ వాళ్ళకి చేరిన వెంటనే మీ మనీ మీ Fiverr అకౌంట్ లోకి వచ్చేస్తుంది.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+