ratan-tata-telugu

Domain Flipping in Telugu - Online Money Earning Telugu

ఆన్ లైన్ లో మనీ సంపాదించానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలోDomain Flippingకూడా ఒకటి. దీనిలో మనం కొంచెం మెదడుకు పని చెబితే చాలు. అసలు Domain Flipping అంటే ఏమిటి? ఎలా చెయ్యాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Domain అంటే ఏమిటి?

ప్రతి ఇంటికి ఒక అడ్రస్ ఎలా ఉంటుందో అలాగే ప్రతి వెబ్ సైట్ కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది. దానినే డొమైన్ అని అంటారు. ఉదాహారానికి మన తెలుగు బడి వెబ్సైటు కి"www.telugubadi.in"డొమైన్ అవుతుంది. అంటే మన వెబ్ సైట్ కి రావాలంటే అది ఒక అడ్రస్ అన్నమాట. గూగుల్ లోwww.telugubadi.in అని సెర్చ్ చేస్తే మన వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.

ఈ రోజుల్లో ఇంటర్నెట్ వాడకం బాగా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి బిజినెస్ పేరుకు సరిపోయే డొమైన్ నేమ్ కోసం పోటీ పడుతున్నారు. దానితో ఈ డొమైన్ నేమ్స్ కి గిరాకీ పెరుగుతుంది.

డొమైన్ ఫ్లిప్పింగ్ అంటే ఏమిటి?

డొమైన్ లను కొనడం, అమ్మడాన్ని Domain Flipping అంటారు. రియల్ ఎస్టేట్ లో ఎలా అయితే స్థలాలు, ఇళ్ళు కొని అమ్ముతుంటారో , అలాగే ఇక్కడ డొమైన్ లను కొని అమ్ముతుంటారు. ఒక స్థలం గాని ఇళ్లు గాని అవి ఉన్న ప్రాంతాన్ని బట్టి వాటి విలువ మారుతుంది. అలాగే ఈ డొమైన్ లు కొన్ని ఫీచర్స్ వలన వాటి విలువ పెరుగుతుంది.

ఈ డొమైన్ లకు ఎంత గిరాకీ ఉందో తెలియాలంటే, ఇంతకు ముందు అత్యంత ధరకి అమ్ముడైన కొన్ని డొమైన్లను క్రింద ఇవ్వడం జరిగింది . ఒకసారి వాటిని గమనించండి.

బెస్ట్ డొమైన్ నేమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?

డొమైన్ ఫ్లిప్పింగ్ లో మీరు చేయవలసిందల్లా మంచి డొమైన్ నేమ్స్ సెలక్ట్ చేసుకోవడమే. కాబట్టి Domain Name సెలెక్ట్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. డొమైన్ నేమ్ చిన్నగా ఉండడం.

డొమైన్ నేమ్ ఎంత చిన్నగా ఉంటె అంత మంచిది. డొమైన్ లోని అక్షరాల సంఖ్య తగ్గేకొద్ధి వాటి విలువ ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి 9 లేదా 10 లెటర్స్ ఉన్న డొమైన్ కంటే 3 లేదా 4 లెటర్స్ ఉన్న డొమైన్ లకి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది.

2. డొమైన్ అందిరికి గుర్తుండేలా ఉండడం.

డొమైన్ నేమ్ అనేది పలకడానికి వీలుగా, అందరికి సులభంగా గుర్తుండేలా చూసుకోండి. అటువంటి డొమైన్ లకు మంచి గిరాకీ ఉంటుంది.

3. డొమైన్ చివర .com extension ఉండడం.

డొమైన్ చివర ఉండే .com, .net , .org వీటిని extensions అని అంటారు. ఇటువంటివి 1000 కి పైగా extensions ఉన్నాయి. వీటిలో .com అనేది బాగా పాపులర్ అయ్యింది. కాబట్టి మనం కొనే డొమైన్ చివర .com ఉంటె మనం తిరిగి అమ్మినప్పుడు ఎక్కువ ధరకి అమ్ముకోవచ్చు.

డొమైన్ ఫ్లిప్పింగ్ ఎలా చెయ్యాలి?

డొమైన్ ఫ్లిప్పింగ్ చెయ్యడానికి ఆన్ లైన్ లో కొన్ని వెబ్ సైట్స్ ఉన్నాయి. వాటిలో Flippa, Sedo, GoDaddy auctions ఇవన్నీ డొమైన్ ఫ్లిప్పింగ్ చెయ్యడానికి బెస్ట్ వెబ్ సైట్లు. వీటిలో మీరు మీ దగ్గర ఉన్న వెబ్ సైట్ లను మీకు కావలసిన ధరకు అమ్ముకోవచ్చు లేదా domain auctions జరుగుతుంటాయి. అంటే వేలం పాట అన్నమాట. మీరు మీ దగ్గర ఉన్న డొమైన్ లను వేలం పాటలో పెట్టవచ్చు. మీ డొమైన్ కావలసిన వాళ్ళు బిడ్స్ వేస్తారు. ఎవరైతే ఎక్కువ ధరకు బిడ్ వేస్తారో, వాళ్లకు మీ డొమైన్ అమ్ముకోవచ్చు. అసలు ఈ డొమైన్ అమ్మకాలు, కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయనేది ఒకసారి Flippa, Sedo, GoDaddy auctions లలో చెక్ చెయ్యండి. ఒక అవగాహన వస్తుంది.

మీరు చెయ్యవలసిందల్లా ఇప్పుడు లేదా భవిష్యత్తులో ఏవి ట్రెండింగ్ అవుతున్నాయో గుర్తించి, వేటికి మంచి గిరాకీ ఉంటుందో బాగా ఆలోచించి వాటికి సంబందించిన డొమైన్ లను కొనడమే. దీనికి పెద్దగా డబ్బుకూడా అవసరం లేదు. ఒక్కొక్క డొమైన్ సుమారుగా 500 రూపాయల నుండి లభిస్తుంది. కాబట్టి ఈ డొమైన్ ఫ్లిప్పింగ్ గురించి మరింత బాగా నేర్చుకుని ఒకసారి ప్రయత్నించండి.

మీరు ఏదైనా డొమైన్ కొనాలనుకుంటున్నారా? >>  Click Here



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+